SRI RAMA PATTABHISHEKAM AT CHANDRAGIRI SRI KRT _ చంద్ర‌గిరి శ్రీ కోదండరామాల‌యంలో శ్రీరామ ప‌ట్టాభిషేకం

Tirupati, 1 May 2021: TTD organised the Sri Rama Pattabhishekam celebrations at Chandragiri Sri Kodandarama Swamy temple on Saturday night in ekantham as per Covid guidelines.

As part of the tradition to celebrate Sri Rama Pattabisskam after performing the annual Brahmotsavam from April 22-30, the TTD conducted the divine episode between 5.00-7.00 pm with special Aradhana, Vastram and Kirita samarpana followed by Veda parayanam and Maha Mangala Harati.

Temple DyEO Sri Subramaniam, superintendent Sri Kumar, Kankana bhattar Sri Srinivasa Bhattar, Inspector Sri Krishna Chaitanya, other Archakas and staff were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చంద్ర‌గిరి  శ్రీ కోదండరామాల‌యంలో శ్రీరామ ప‌ట్టాభిషేకం
తిరుప‌తి, 2021 మే 01: చంద్ర‌గిరి శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో శ‌నివారం సాయంత్రం శ్రీరామ ప‌ట్టాభిషేకం జ‌రిగింది. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.
ఆల‌యంలో ఏప్రిల్ 22 నుండి 30వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. బ్ర‌హ్మోత్స‌వాల త‌రువాతి రోజు ప‌ట్టాభిషేకం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ రామపట్టాభిషేకం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా విశేష ఆరాధనలు చేప‌ట్టి ఆ తరువాత స్వామివారికి వ‌స్త్ర స‌మ‌ర్ప‌ణ‌, కిరీట స‌మ‌ర్ప‌ణ చేశారు. చివ‌ర‌గా వేద‌ పారాయ‌ణం, మ‌హా మంగ‌ళ‌హార‌తి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ  డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్‌ శ్రీ కుమార్‌, కంక‌ణ‌బ‌ట్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాస బ‌ట్ట‌ర్‌‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణ‌చైత‌న్య‌, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.