SRI SITA RAMA KALYANAM-A CYNOSURE TO THE EYES OF DEVOUT_ నేత్ర‌ప‌ర్వంగా శ్రీ సీతారాముల కల్యాణం
By TTD News On 15 Apr, 2019 At 09:50 PM | Categorized As Temple News

Tirupati, 15 April 2019: The most important, auspicious and sacred event- Sri Sita Rama Kalyanam took place with utmost religious fervour in the famous, ancient temple of Lord Sri Kodanda Rama Swamy in Tirupati on Monday evening.

The celestial bridegroom Sri Rama and celestial bride Sita Devi seated in all their splendor on the specially decked Kalyana Vedika and the ceremonious wedding was performed amidst the chanting of Vedic mantras by the priests of the temple.

The devotees who thronged in large numbers to witness the celestial wedding were captivated by the divine charm of the ideal couple.

Tirumala JEO Sri KS Sreenivasa Raju took part in this celestial fete. Earlier he carried the silk vastrams of Lord over his head and handed over the “Sare” to be decorated to the Lord during the wedding.

The devotees chanted Jai Sri Ram once the celestial wedding ceremony was completed with aplomb.

Temple Deputy EO Sri EC Sreedhar, VGO Sri Ashok Kumar Goud and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నేత్ర‌ప‌ర్వంగా శ్రీ సీతారాముల కల్యాణం

ఏప్రిల్ 15, తిరుప‌తి, 2019: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం శ్రీ‌ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో స్వామి, అమ్మవారిని ఆశీనులను చేసి అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణఘట్టాన్ని నిర్వహించారు. టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు పాల్గొన్నారు.

సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండుగగా ప్రారంభమైంది. టిటిడి వైఖానస ఆగమస‌ల‌హాదారులు శ్రీ కె.ఎస్‌.రాజేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో కల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధన, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ఇసి.శ్రీ‌ధ‌ర్‌, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ జి.రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ వై.రమేష్‌ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v