SRINIVASA MANGAPURAM COMMENCES VIRTUAL SEVAS ON IMPORTANT DAYS _ శ్రీ‌నివాస‌మంగాపురంలో విశేష రోజుల్లో వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వ సేవ‌

Tirupati, 28 Jan. 22: After the successful implementation of virtual sevas in Tirumala and at Tiruchanoor temples, TTD is all set to launch virtual sevas in Srinivasa Mangapuram also.

 

As part of this, TTD has decided to open the doors for virtual Kalyanotsavam in Srinivasa Mangapuram during important occasions from February onwards.

 

The devotees shall procure the Kalyanotsavam tickets in online. The important days holding virtual Kalyanotsavams includes Vasanta Panchami on February 5, Ekadasi on February 12, Telugu Ugadi on April 2, Chaitra Pournami on April 16, Shravana on May 21, Dwadasi on June 11, again Shravana star on June 18, Dwadasi on June 25, Rohini on August 20, Pournami on September 10 and October 22, Dwadasi on November 5.

 

The devotees shall watch the live Kalyanam on SVBC during these days and the price of the virtual Kalyanotsavam ticket is Rs. 500. The devotees shall avail darshan for two members on one ticket within three months time at Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram. They will be also presented with a uttariyam and a blouse piece along with Akshatas as blessings from the presiding deity.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ‌నివాస‌మంగాపురంలో విశేష రోజుల్లో వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వ సేవ‌

తిరుప‌తి, 2022 జ‌న‌వ‌రి 28: శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ముఖ్య ప‌ర్వ‌దినాల్లో నిర్వ‌హించే క‌ల్యాణోత్స‌వాన్ని వ‌ర్చువ‌ల్ సేవ‌గా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది.

భ‌క్తులు ఆన్‌లైన్ ద్వారా క‌ల్యాణోత్స‌వం సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 5న వ‌సంత పంచ‌మి సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం సేవ ప్రారంభం కానుంది. ఫిబ్ర‌వ‌రి 12న ఏకాద‌శి, ఏప్రిల్ 2న ఉగాది, ఏప్రిల్ 16న చైత్ర పౌర్ణిమ‌, మే 21న శ్ర‌వ‌ణా న‌క్ష‌త్రం సంద‌ర్భంగా ఈ సేవ‌ నిర్వ‌హిస్తారు. అలాగే, జూన్ 11న ద్వాద‌శి, జూన్ 18న శ్ర‌వ‌ణా న‌క్ష‌త్రం, జూన్ 25న ద్వాద‌శి, ఆగ‌స్టు 20న రోహిణీ న‌క్ష‌త్రం, సెప్టెంబ‌రు 10న పౌర్ణ‌మి, అక్టోబ‌రు 22న, న‌వంబరు 5న ద్వాద‌శి సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం సేవ నిర్వ‌హిస్తారు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ క‌ల్యాణోత్స‌వాల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. ఈ సేవా టికెట్ ధ‌ర రూ.500/-. భ‌క్తులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని త‌మ ఇళ్ల నుండి వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో పాల్గొనాల్సి ఉంటుంది. సేవ‌లో పాల్గొన్న మూడు నెల‌ల‌లోపు స్వామివారి ద‌ర్శ‌నానికి ఇద్ద‌రిని ఉచితంగా అనుమ‌తిస్తారు. దీంతో పాటు ఉత్త‌రీయం, ర‌విక‌, అక్షింత‌లు బ‌హుమానంగా అందిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.