SRINIVASA WEDS PADMAVATHI ON THE AUSPICIOUS DAY OF VAISAKHA SUDDHA DASAMI_ అశ్వవాహనంపై పెళ్లికుమారుడిగా శ్రీనివాసుడు
By TTD News On 14 May, 2019 At 08:11 PM | Categorized As Temple News

Tirumala, 14 May 19: The second day of ongoing three day Parinayotsavams witnessed huge turn out of devotees since this happens to be the most important day.

As per the legend the wedding ceremony of Sri Padmavathi-Srinivasa lasted for three days. Commenced on the auspicious Visakha Navami, concluded on Ekadasi. The celestial marriage took place on visakha sudha Dasami, the second day.

Earlier the Lord was brought to the Parinaya Mandapam situated in Narayanayagiri Gardens on Aswa Vahanam while the Goddesses on separate palanquins.

After vedic rendition, the Annamacharya keertans and Hari katha parayanam enthralled the devotees.

Incharge JEO of Tirumala Sri B Lakshmi kantham along with his spouse Smt Sobhalatha, DyEO Sri Harindranath, Garden DyDirector Sri Srinivasulu, Peishkar Sri Lokanatham and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అశ్వవాహనంపై పెళ్లికుమారుడిగా శ్రీనివాసుడు

తిరుమల, 2019 మే 14: శ్రీపద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవంలో రెండవ రోజైన మంగ‌ళ‌వారం రోజున వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాల ద్వారా తెలుస్తుంది. కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది.

మంగ‌ళ‌వారం సాయంత్రం శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి, వెంట స్వర్ణ పల్లకిలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. మొదటిరోజు మాదిరే శ్రీవారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు జరిగింది. ఈ కొలువులో హరికథ, నృత్యం, పురాణం, ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత శ్రీవారు దేవేరులతో పల్లకినెక్కి తిరువీధుల గుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు.

ఈ సందర్భంగా మూడురోజులు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమ‌ల ఇన్‌చార్జ్ జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, పేష్కార్ శ్రీ లోక‌నాథం, ఆలయ ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v