SRIVARI PARUVETA UTSAVAM ON JANUARY 16 _ జనవరి 16న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

Tirumala, 9 Jan. 20: A day after Sankranthi festival, the TTD is organising a grand celebration of Srivari Paruveta utsavam on January 16 in addition to Goda Parinayotsavam.

As a part of Goda Parinayotsavam the malas (floral garlands) of Andal Ammavaru are presented to Srivaru after a procession in mada streets from Pedda Jeeyangar mutt.

Thereafter, Sri Malayappaswamy and Sri Krishna Swamy are taken to Paruveta mandapam for Asthanam and mock hunt fete and later return to temple in the evening.

In view of festivals the TTD has cancelled all arjita sevas on January 15 like Tomala seva, Archana, Tiruppavada, Kalyanotsavam, Unjal seva, Brahmotsavams, Vasantotsavam, Sahasra Deepalankara sevas.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జనవరి 16న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం 

తిరుమల, 2020 జనవరి 09: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున  కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు.
       
గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 9.00 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు.

ఆనంత‌రం మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు.

ఆర్జితసేవలు రద్దు :

ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే తోమాలసేవ, అర్చన, తిరుప్పావ‌డ‌, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.