SRIVARI SEVAKULU RENDER EXCELLENT SERVICES AT VONTIMITTA_ ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి సేవలో ‘శ్రీవారి సేవకులు’
By TTD News On 15 Apr, 2019 At 12:34 PM | Categorized As Brahmotsavams

Vontimitta, 15 Apr. 19: Braving the scorching summer and driven by their devotion nearly 500 Srivari Sevakulu from Kadapa, Rajampeta, Proddatur, Rayachoti are providing excellent services to devotees from all over AP and Telangana during the ongoing Sri Rama Navami Brahmotsavams at historical Sri Kodandarama Swamy Temple at Vontimitta in Kadapa district.

Their number would touch 1000 during celestial event of Sitarama Kalyanam slated on April 18.

The Srivari Sevakulu are serving devotees as volunteers since 2000 in all TTD organisations and temples and more particularly during festivals and auspicious events.

Their services are bring utilised across the country in TTD programs like Srinivasa Kalyanam, dharmic campaigns, Srivari Vaibhavotsavams etc.

They maintained queue lines, distributed Anna pradadams in Sri Kodandaramaswami Brahmotsavams at vontimitta. For the Sitarama
Kalyanam they are engaged in the preparation of packets of akshintalu, muthyalu and kankanam for distribution to devotees.

The groups of Srivari Sevakulu who include women employees, business men and housewives are engaged in services from morning 8.00am to night 10.00 pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి సేవలో ‘శ్రీవారి సేవకులు’

ఒంటిమిట్ట, 2019 ఏప్రిల్ 15: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు శ్రీవారి సేవకులు విశేష సేవలందిస్తున్నారు. సాధారణ రోజులలో కడప, రాజంపేట, ప్రొద్దుటూరు, రాయచోటి నుండి దాదాపు 500 మంది, ఏప్రిల్ 18వ తేదీ శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా 1000 మందికి పైగా శ్రీవారి సేవకులు సేవలందించనున్నారు.

”మానవసేవయే మాధవసేవగా” భావించి టిటిడి 2000వ సంవత్సరం నవంబరు 1న తిరుమలలో ”శ్రీవారి సేవ” స్వచ్ఛంద సేవను ప్రారంభించింది. అప్పటి నుండి తిరుమలకు విచ్చేసే భక్తులకు ప్రతిరోజూ 2 వేల మంది శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు. టిటిడి అనుబంధ ఆలయాల్లో ఉత్సవాలు, పర్వదినాల సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులు భక్తులకు విశేష సేవలందిస్తునారు. టిటిడి స్థానికంగా ఉన్న వారి సేవలను వినియోగించుకుంటూ వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, వారిని భాగస్వాములను చేస్తోంది. దేశ విదేశాలలో టిటిడి నిర్వహించే ధర్మప్రచార కార్యక్రమాలైన మనగుడి, కైశిక ద్వాదశి, గోపూజ, శ్రీనివాస కల్యాణాలు, శ్రీవేంటేశ్వరస్వామివారి వైభవోత్సవాలలో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని సేవలందిస్తున్నారు.

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, క్యూలైన్లు, అన్నప్రసాదాల పంపిణీలో శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. ఏప్రిల్ 18వ తేదీ శ్రీసీతారాముల కల్యాణానికి విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు అందజేసేందుకు టిటిడి యాత్రికుల వ‌స‌తి స‌మూదాయంలో అక్షింతలు, ముత్యం, కంకణం కలిపి ప్యాక్‌ చేస్తున్నారు.

వీరిలో మహిళా ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు స్వామివారిపై ఉన్న భక్తితో ఉదయం 8.00 నుండి రాత్రి 10.00 గంటల వరకు బ్రహ్మోత్సవాలలో వివిధ విభాగాలలో సేవలందిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v