SVBC EMPLOYEE TERMINATED _ విధుల నుండి ఎస్వీబీసీ ఉద్యోగి తొల‌గింపు

Tirupati, 11 Nov  20: The Sri Venkateswara Bhakti Channel management (TTD) terminated one of it’s employees on Wednesday,  after his alleged involvement in forwarding a porn site link to a devotee has been proved.

According to CEO SVBC, the terminated employee discharges duty as an Office Subordinate (OSO-Attender). Following a complaint forwarded by a devotee Sri Venkata Krishna who sought some details regarding “Shatamanam Bhavati”, a programme in SVBC, he received a porn site link as a reply from the said employee through sb@svbcttd.org. The devotee brought the same to the notice of the Chairman and TTD EO for immediate action.

The TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy immediately directed for a detailed enquiry.

A team consisting 25 software engineers carried out Computer Security Audit in SVBC and a Cyber Cell team has been constituted. During the Vigilance enquiry it was found that a few more employees are also involved in such willful, indecent conduct. If proved guilty, action will be initiated on those employees too.

Meanwhile, the SVBC attender was terminated with immediate effect after he was proved guilty behind forwarding the porn site link to the devotee.

To protect and safeguard the reputation of SVBC some important decisions have been taken.

Henceforth all the computers in SVBC will function under the supervision of TTD IT Wing and each computer will be allotted a password for security purposes. It has also been decided to bring SVBC under the supervisory control of TTD Vigilance.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

విధుల నుండి ఎస్వీబీసీ ఉద్యోగి తొల‌గింపు 
తిరుపతి, 2020 న‌వంబ‌రు  11: శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ఒఎస్ ఒ( అటెండ‌ర్‌)గా విధులు నిర్వ‌హిస్తున్న ఒక ఉద్యోగిని  బుధ‌వారం విధుల నుండి తొల‌గించిన‌ట్లు ఎస్వీబీసీ సిఇవో ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
ఈ ఏడాది సెప్టెంబ‌రు నెల‌లో శ్రీ వెంక‌ట క్రిష్ణ అనే భ‌క్తుడు శ‌‌త‌మానం భ‌వ‌తి కార్యక్రమానికి సంబందించిన వివ‌రాల‌ను ఇ-మెయిల్ ద్వారా కోరారు. అందుకు ఎస్వీబీసీ ఉద్యోగి  sb@svbcttd.org నుండి భక్తుడికి అశ్లీల‌ వెబ్ సైట్ కు సంబంధించిన లింక్ పంపించారు. దీనిపై భ‌క్తుడు టిటిడి ఛైర్మ‌న్‌, ఈవోల‌కు పిర్యాదు చేశారు.
ఈ విష‌యంపై స్పందించిన‌ టిటిడి చైర్మ‌న్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి, ఈవో డా.కె.ఎస్‌.జవహర్ రెడ్డి విచార‌ణ‌కు ఆదేశించారు.
విచారణలో భాగంగా టిటిడికి చెందిన దాదాపు 25 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లతో ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ అడిట్ చేశారు. సైబర్ సెల్ టీం దర్యాప్తులో మరో ముగ్గురు లేదా నలుగురు ఉద్యోగులు ఇలాంటి పనులు చేసినట్లు తెలిసింది. ఇంకా ఎంతమంది ఉద్యోగులు ఇలాంటి పనులు చేశారో పరిశీలించి వారిని కూడా ఉద్యోగం నుండి తొలగించడం జరుగుతుందని ఎస్వీబీసీ సిఇవో తెలిపారు.
ఈ విచార‌ణ‌లో వాస్త‌వాలు రుజువు అయినందున ఎస్వీబీసీ ఒక ఉద్యోగిని  ఒఎస్ ఒ( అటెండ‌ర్‌)ను త‌క్ష‌ణం ఉద్యోగం నుండి తొల‌గించ‌డ‌మైన‌ది.
ఈ సంఘటన అనంతరం సంస్థ  ప్రతిష్టను పరిరక్షించడంలో భాగంగా పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నది. ఇకపై ఎస్వీబీసీ కంప్యూటర్ ఆపరేషన్ టీటీడీ ఐటీ విభాగం పర్యవేక్షణలో జరుగుతుంది. ఎస్వీబీసీలో ప్రతి కంప్యూటర్ కు పాస్వర్డ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ఏ కంప్యూటర్ ను ఎవరు ఉపయోగిస్తున్నారు అనేది తెలుస్తుంది. అదేవిధంగా
ఎస్వీబీసీని  టీటీడీ విజిలెన్స్ పర్యవేక్షణలోనికి  తీసుకురావాలని నిర్ణయించడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.