SVBC TO TELECAST YOGAVASHISTYAM AND DHANWANTARI MANTRAS WITH TAMIL AND KANNADA NARRATIONS TOO _ తమిళ, కన్నడ ఛానళ్లలో “శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణం పునఃప్రసారం

Tirumala, 25 April 2020 : The Maha Mantra Parayana will be henceforth narrated in Tamil and Kannada in SVBC.

With increasing global viewership for the live telecast of Yogavashiatyam-Dhanwantari Maha Mantra Parayanam on SVBC since April 10, the TTD owned channel has now come up with yet another innovative idea of narrating the essence of these mantras in Sanskrit and Tamil also.

Yogavashistyam and Dhanvanthri Maha Mantra parayanam is being performed under the aegis of Dharmagiri Veda Vijnana Peetham and is now telecast daily for one hour between 7am and 8am with Telugu narrative for Sanskrit slokas by Dharmagiri Principal Sri KSS Avadhani.

On popular demand from devotees of other states the TTD has now decided for repeat telecast of the parayanams with narrative in Tamil and Kannada every day between 3pm and 4pm and repeat telecast again at night between 10.30pm and 11.30 pm in the Tamil and Kannada channels of SVBC.

Eminent scholars Acharya Chakravarti Raghavan will render Tamil narrative while Dr L Pavan Kumar will present Kannada narrative.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తమిళ, కన్నడ ఛానళ్లలో “శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణం పునఃప్రసారం
భక్తుల కోసం ఆయా భాషల్లో మంత్ర వివరణ
తిరుమ‌ల‌, 2020 ఏప్రిల్ 25 ; తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ఆధ్వ‌ర్యంలో ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌‌కు నాద‌నీరాజ‌నం వేదిక‌పై “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయణాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్న విషయం విదితమే. ఇందులో సంస్కృత శ్లోకాలకు తెలుగులో మంత్ర వివరణ చెబుతారు. అయితే, తమిళ, కన్నడ భక్తులకు అర్థమయ్యేందుకు వీలుగా సంస్కృత శ్లోకాలకు ఆయా భాషల్లో మంత్ర వివరణతో  ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ,  మల్లీ రాత్రి 10.30 నుంచి 11.30 గంటల  వరకు ఎస్వీబీసీ తమిళ, కన్నడ ఛానళ్లలో పునఃప్రసారం చేస్తున్నారు.
ప్రముఖ పండితులు ఆచార్య చక్రవర్తి రాఘవన్ తమిళంలో, డా.కెఎల్.పవన్ కుమార్ కన్నడంలో వ్యాఖ్యానం చేస్తున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.