SVIMs AND TATA CANCER HOSPITALS TO BECOME REGIONAL CANCER CENTRES- TTD EO _ రీజనల్ క్యాన్సర్ అసుపత్రులుగా స్విమ్స్, టాటా క్యాన్సర్ ఆస్పత్రి : టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

Tirupati, 03 April 2022: TTD EO Dr KS Jawahar Reddy said on Sunday that AP Government has decided to elevate the SVIMS hospital and Tata cancer hospital at Tirupati into regional cancer Centers.

Speaking after his visit to the Oncology wing of SVIMS and Tata cancer hospital under construction on Sunday, he said eminent cancer specialist and Advisor to AP Government Dr Nori Dattatreyudu had visited both hospitals and made valuable suggestions to State officials to make them regional cancer centres.

He said that while the Tata cancer hospital is likely to be inaugurated by May 1st week, TTD is expeditiously organising the recruitment of medical staff and equipment for the Oncology department at SVIMS.

TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, SVIMS Director Dr Vengamma, Estate Officer Sri Mallikarjun, Tata Cancer Hospital In-Charge Dr BR Ramanan, Dr Nageswar Reddy, TTD Chief Engineer Sri Nageswar Rao were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రీజనల్ క్యాన్సర్ అసుపత్రులుగా స్విమ్స్, టాటా క్యాన్సర్ ఆస్పత్రి : టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి
తిరుపతి, 2022   ఏప్రిల్‌  03: మెరుగైన క్యాన్సర్ చికిత్స కోసం స్విమ్స్, టాటా క్యాన్సర్ ఆస్పత్రిని రాయలసీమ రీజనల్ క్యాన్సర్ అసుపత్రులుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. స్విమ్స్ ఆంకాలజీ విభాగం, నిర్మాణంలో ఉన్న టాటా క్యాన్సర్ ఆసుపత్రిని ఆదివారం ఈఓ సందర్శించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత నెలలో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ దత్తాత్రేయ నోరి స్విమ్స్ ఆంకాలజీ విభాగాన్ని, టాటా క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించారని చెప్పారు. క్యాన్సర్ వ్యాధి నిర్మూలన, మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై రాష్ట్రస్థాయి అధికారులతో చర్చించారని వివరించారు. ఇందులో భాగంగా ఈ రెండు ఆసుపత్రులను మరోమారు తాను పరిశీలించానని తెలిపారు. శ్రీవారి దయతో మే మొదటి వారంలో టాటా క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. స్విమ్స్ ఆంకాలజీ విభాగంలో మౌలిక వసతులు, సిబ్బంది అవసరం ఉందని, వీటిని సమకూరుస్తామని చెప్పారు.
ఈవో వెంట జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, , ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ మల్లికార్జున, టాటా క్యాన్సర్ ఆస్పత్రి ఇంచార్జ్ డాక్టర్ బిఆర్.రమణన్, Dr. నాగేశ్వర్ రెడ్డి ,టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.