జూలై 26న మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం
By TTD News On 10 Jul, 2018 At 11:24 AM | Categorized As Press Releases

జూలై 26న మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి, 2018 జూలై 10: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం జూలై 26న తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం 16,750 కిలోల బియ్యాన్ని వేలానికి సిద్ధంగా ఉంచారు. రూ.112/- డిడి తీసి టెండరు షెడ్యూల్‌ పొందొచ్చు. వేలంలో పాల్గొనేందుకు రూ.2,500/- ఇఎండిగా చెల్లించాలి. ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో గానీ, www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v