శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య 611వ జయంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
By TTD News On 14 May, 2019 At 11:56 AM | Categorized As General News

శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య 611వ జయంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

తిరుపతి, 2019 మే 14: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 611వ జయంతి ఉత్సవాల పోస్టర్లను టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ బి.ల‌క్ష్మీకాంతం మంగ‌ళ‌వారం తిరుపతిలోని జెఈవో క్యాంపు కార్యాల‌యంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ అన్నమయ్య జయంతి ఉత్సవాలు మే 18 నుండి 24వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా క‌డ‌ప జిల్లా తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరం వ‌ద్ద మే 18వ తేదీన ఉదయం 9.00 గంట‌ల‌కు సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం, ఉద‌యం 10.30 గంట‌ల‌కు శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

తాళ్లపాకలో..

మే 18 నుండి 24వ తేదీ వరకు సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.

తిరుపతిలో..

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 19 నుండి 21వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు సాహితీ సదస్సులు, సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహతి కళాక్షేత్రంలో మే 18 నుండి 24వ తేదీ వరకు సాయంత్రం 6.00 నుండి సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ విశ్వ‌నాథం, సూపరింటెండెంట్ శ్రీ సూర్య‌నారాయ‌ణ‌రెడ్డి, సిబ్బంది శ్రీ న‌ర‌సింహులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v