మార్చి 2 నుంచి 7వ తేదీ వరకు తుమ్మూరులోని శ్రీ కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు
By TTD News On 28 Feb, 2019 At 01:33 PM | Categorized As Special Gallery

మార్చి 2 నుంచి 7వ తేదీ వరకు తుమ్మూరులోని శ్రీ కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2019 ఫిబ్రవరి 28: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరులోని శ్రీ కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 2 నుంచి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మార్చి 1వ తేదీన సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.

బ్రహ్మోత్సవాలకు ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

02-03-2019(శ‌నివారం) ధ్వజారోహణం(8.07గం||లకు) శేష వాహనం

03-03-2019(ఆదివారం) చప్పర ఉత్సవం రావణ వాహనం

04-03-2019(సోమ‌వారం) చప్పర ఉత్సవం నంది, హంసవాహనం

05-03-2019(మంగ‌ళ‌వారం) చప్పర ఉత్సవం మోహినీ అవ‌తారం, గజ, సింహవాహనం, కల్యాణోత్సవం

06-03-2019(బుధ‌వారం) చప్పర ఉత్సవం ధ్వజావరోహణం

07-03-2019(గురువారం) ——- ఏకాంతసేవ.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v