JEO LAKSHMIKANTHAM INSPECTS WORKS AT SRI PAT_ తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వ‌స‌తి సముదాయంను ప‌రిశీలించిన – తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం
By TTD News On 13 Feb, 2019 At 06:38 PM | Categorized As Uncategorized

Tirupati, February 13,2018: Tirupati JEO Sri B Lakshmikantham today inspected the new devotee facilitation Padmavati pilgrims amenities Centre at Tiruchanoor.

Speaking to media persons later he said the new 4.25 lakh sq. feet PAC was coming up over 5.25 acres. H directed officials to make with amenities for drinking water, Anna Prasadam, rooms with furniture TTDs publication center, ATMs, luggage counters, toilets and lockers, security etc.

He also directed the DFO to plants around the facility to provide green space to devotees. TTD plans to run regular RTC buses to Tirumala, Tirupati and also set up token counters for Srivari darshan and online facility to book rooms, he said.

Earlier he went around the PAC and urged the officials to complete all works on war footing and facilitate devotees by appointing all necessary staff.

Thereafter the JEO also visited the Sri Padmavati ammavari temple and had darshan and also inspected the queue lines, Anna Prasadam, security and others in the temple.

Chief engineer Sri Chandrasekhar Reddy, SE Sri Ramulu.temple DyEO Smt Jhansi Rani, VGO Sri Ashok Kumar Gowd participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వ‌స‌తి సముదాయంను ప‌రిశీలించిన – తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

తిరుపతి, 2019 ఫిబ్రవరి 13: సిరుల‌త‌ల్లి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు కొలువైన తిరుచానూరులో భ‌క్తుల సౌక‌ర్యార్థం టిటిడి నూత‌నంగా నిర్మిస్తున్న శ్రీ ప‌ద్మావ‌తి వ‌స‌తి స‌మూదాయాని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం బుధ‌వారం ఉద‌యం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరులో 5.25 ఎక‌రాల విస్తీర్ణంలో 4.25 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల‌లో వసతి గృహ‌న్నినిర్మించిన‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా తాగునీరు, అన్నప్రసాదాలు, గ‌దుల‌లో ఫ‌ర్నిచ‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల్ వైరింగ్‌, నీటి స‌ర‌ఫ‌రా, ప్ర‌చుర‌ణ‌ల విక్ర‌య కేంద్రం, ఎటిఎమ్‌లు, లగేజి కౌంటర్లు, మరుగుదొడ్లు, లాక‌ర్లు, భ‌ద్రాత సిబ్బంది, తదితర విషయాలపై సమీక్షించి ప‌లు సూచ‌న‌లు చేశారు. భ‌క్తుల‌కు అహ్లాద‌క‌రంగా ఉండేందుకు విరివిగా చెట్ల‌ను నాటాల‌ని డిఎఫ్‌వోను ఆదేశించారు. అదేవిధంగా వ‌స‌తి స‌మూదాయం నుండి తిరుప‌తి, తిరుమ‌ల‌కు ఆర్‌టిసి బ‌స్సులు న‌డిపేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం శ్రీ‌వారి ద‌ర్శ‌నం టోకెన్లు పొందేందుకు కౌంట‌ర్లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. భ‌క్తులు వ‌స‌తి గృహంలోని గ‌దుల‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపారు.

అంత‌కుముందు జెఈవో, ఇంజినీరింగ్ అధికారుల‌తో క‌లిసి శ్రీ పద్మావతి వసతి సముదాయంలో జ‌రుగుగున్న ప‌నుల‌ను ప‌రిశీలించారు. వ‌స‌తి స‌మూదాయంలో తాగునీరు, లాకర్లు, నీటిసరఫరా, ఫర్నిచర్‌, తదితర సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అసంపూర్ణంగా ఉన్న ఇంజినీరింగ్‌ పనులను పూర్తిచేయాలన్నారు. వసతి సమూదాయంలో అవసరమైన సిబ్బందిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ‌స‌తి గృహలలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అందుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంత‌రం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకుని, ఆల‌యంలో భ‌క్తుల‌కు అందుతున్న సౌక‌ర్యాలు, క్యూలైన్లు, అన్న‌ప్ర‌సాదాలు పంపిణీ, భ‌ద్ర‌త‌ త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించారు. భ‌క్తుల‌కు మ‌రింత వేగంగా, సుల‌భంగా అమ్మ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఎస్ఇ శ్రీ రాములు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v