TIRUMALA JEO CLARIFIES ON PRASADAM RATES_ ధార్మిక కార్యక్రమాలలో అదనపు ప్రసాదాలకు మాత్రమే పెంచిన ధరలు ప్రైవేటు కార్యక్రమాలకు ప్రసాదాలు అందించడం లేదు
By TTD News On 5 Dec, 2017 At 06:26 PM | Categorized As General News

Tirupati,5 December 2017: The temple management of TTD has not increased the rates of laddu prasadams for general pilgrims but revised rates for dharmic organisations which are organising religious programmes with the support of TTD in various places on their request, asserted Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Giving clarification on the revised rates of prasadams to religious institutions in Sri Padmavathi Rest House in Tirupati on Tuesdayevening, the JEO said, keeping in view of the representations that are being received from certain religious organisations for the supply of additional laddu and vada prasadams whenever religious programmes are organised in their places, TTD has revised the tariff of prasadams only on such requests.

“We normally supply 10 Big laddus at Rs.100 each, 10 vadas at Rs.25 each, 200 small laddus at Rs.25 each and 1000 mini laddus at Rs.3.50each. But some organisations appealed to us that the devotees are coming in thousands in some areas and they require more prasadams. They also mentioned that they are willing to pay the amount fixed by TTD on these additional prasadams. So we have revised the tariffs for Big laddus as Rs.200 per laddu, vada at Rs.100 each, small laddu at Rs.50 each and mini laddus at Rs.7 each. The above prasadams will also be supplied to the organisations on payment subject to availability of stock. There is absolutely no change in the price of laddus that are given to pilgrims. These prasadams will also be not sold to any non religious functions or organisations”, he clarified.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

ధార్మిక కార్యక్రమాలలో అదనపు ప్రసాదాలకు మాత్రమే పెంచిన ధరలు ప్రైవేటు కార్యక్రమాలకు ప్రసాదాలు అందించడం లేదు

తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు స్పష్టం

డిసెంబరు 05, తిరుమల, 2017: టిటిడి, ఇతర సంస్థలు నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలలో భక్తులకు అందించే అదనపు ప్రసాదాలకు మాత్రమే పెంచిన ధరలు వర్తిస్తాయని తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు.

అనంతరం జెఈవో మాట్లాడుతూ టిటిడి నిర్వహించే శ్రీనివాస కల్యాణాలు, ఇతర ధార్మిక సంస్థలు నిర్వహించే ధార్మిక కార్యక్రమాలలో అదనపు ప్రసాదాలు అందించాలని భక్తులు కోరుతున్నారని తెలిపారు. ప్రస్తుతం తిరుమల వెలుపల నిర్వహించే ధార్మిక కార్యక్రమాలకు 10 పెద్ద లడ్డూలు, 10 వడలు, 200 చిన్న లడ్డూలు, 1000 మినీ లడ్డూలు సాధారణ ధరలకు అందిస్తున్నట్లు చెప్పారు. ధార్మిక కార్యక్రమాల నిర్వాహకులు అదనంగా ప్రసాదాలు కోరిన పక్షంలో పెంచిన ధరలను వర్తింపచేసి పరిమితంగా ప్రసాదాలను అందచేస్తామన్నారు. శ్రీవారి లడ్డూల ఉత్పత్తిని గతం కంటే పెంచలేదని, అందుబాటులో ఉన్న నిల్వ ప్రకారం పరిమితంగానే ప్రసాదాలను ధార్మిక కార్యక్రమాలకు అందిస్తామని వివరించారు. ప్రైవేట్‌ కార్యక్రమాలకు శ్రీవారి ప్రసాదాలను అందించేది లేదని స్పష్టం చేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am