TIRUMALA JEO LAUDS CONTRIBUTIONS OF DR BR AMBEDKAR_ బహుముఖ మేధావి డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు
By TTD News On 14 Apr, 2019 At 04:36 PM | Categorized As General News

Tirupati, 14 Apr. 19: TTD Joint Executive Officer in Tirumala Sri KS Sreenivasa Raju today lauded the multifaceted personality of Dr BR Ambedkar for the all round advancement of workers, Dalits, backward classes and women in the society.

Addressing the 128th Jayanti Of Dr BR Ambedkar conducted by the TTD at Annamacharya Kala mandir as chief guest the JEO said Dr Ambedkar was not just a personality but a strong force and untouchability will be evaporated only when all Dalit become educated and enlightened. It was Dr Ambedkar struggle that had brought universal freedom of speech, equality before law; TTD was a role model for giving equality for all sections of society. he said.

Special invitee Dr K Rataiah former Vice Chancellor of Dravid University, prominent lady advocate Smt Sampoorna Lauded the Dalit empowerment in the TTD.

Earlier the JEO garlanded the portraits of Lord Venkateswara and Dr Ambedkar. He also presented awards to several TTD employees who had excelled in promoting communal harmony in TTD. He also gave away prizes to winners of essay writing competitions.

DyEO Smt Snehalata, EE Sri Manoharam, TTD employees participated in the event

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బహుముఖ మేధావి డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

ఏప్రిల్‌ 14, తిరుపతి, 2019: భారత రాజ్యాంగ నిర్మాత డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ బహుముఖ మేధావి అని, కార్మికులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మహిళల ఉన్నతి కోసం నిరంతరం శ్రమించారని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు పేర్కొన్నారు. డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ 128వ జయంతిని ఆదివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ అంబేద్కర్‌ ఒక వ్యక్తి కాదని, సమాజాన్ని మార్చిన శక్తి అని అభివర్ణించారు. అణగారిన వర్గాలు విద్యనభ్యసించి చైతన్యవంతులైనప్పుడే సమాజంలో అంతరాలు తొలగిపోతాయని తెలియజేశారు. అంబేద్కర్‌ స్ఫూర్తితో జీవితాన్ని అభివృద్ధి చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమసమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. అంబేద్కర్‌ కృషి వల్లనే సగటు భారతీయుడు నేడు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అనుభవించగలుగుతున్నారని తెలిపారు. న్యాయస్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సమాజంలోని అన్నివర్గాల వారికి అందాలని తపించిన గొప్ప మానవతామూర్తి అంబేద్కర్‌ అన్నారు. టిటిడిలో అన్ని వర్గాల ఉద్యోగులకు సమాన అవకాశాలు లభిస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు.

గౌరవ ఆహ్వానితులుగా విచ్చేసిన కుప్పం ద్రవిడ వర్సిటీ మాజీ ఉపకులపతి డా|| కె.రత్తయ్య మాట్లాడుతూ భవిష్యత్‌ తరాల అవసరాలను ముందుగానే ఆలోచించి, అందుకుతగ్గట్టు చట్టాలను రూపొందించిన మహనీయుడు అంబేద్కర్‌ అన్నారు. ఆనాటి పరిస్థితుల్లో అత్యుత్తమ విద్యను అభ్యసించిన ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. దళిత, గిరిజనులను గౌరవిస్తూ టిటిడి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తిరుపతికి చెందిన న్యాయవాది శ్రీమతి కె.సంపూర్ణ మాట్లాడుతూ శాస్త్రీయంగా ఆలోచించి మహిళల హక్కుల కోసం కృషి చేశారని తెలిపారు. మహిళా వివక్షను వ్యతిరేకించి వారికి రాజ్యాధికారం కోసం ప్రయత్నించారని, హిందూ కోడ్‌ బిల్లు, ప్రసూతి సెలవులను తీసుకొచ్చేందుకు చట్టాలు చేశారని వివరించారు.

అనంతరం పలువురు టిటిడి ఉద్యోగులు ప్రసంగించారు. ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అంతకుముందు టిటిడి జెఈవో శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ పటానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా టిటిడి ఉద్యోగులు శ్రీ కె.రామకృష్ణ, శ్రీమతి ఎం.సరస, శ్రీపి.కృష్ణమూర్తి, శ్రీ ఎన్‌.హరిబాబు, శ్రీ జి.రామయ్యకు కమ్యూనల్‌ అవార్డులను జెఈవో ప్రదానం చేశారు. వ్యాసరచన పోటీల్లో విజేతలైన శ్రీమతి కె.జ్యోత్స్నాదేవి, శ్రీ జె.భాస్కర్‌, శ్రీమతి జి.అలేఖ్యలకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, ఇఇ శ్రీమనోహరం, టిటిడి ఉద్యోగులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v