TIRUMALA REVERBERATES TO ANNAMAIAH SANKEERTHANA _ అన్నమయ్య సంకీర్తన‌ల‌తో పులకించిన స‌ప్త‌గిరులు

518th DEATH ANNIVERSARY OF THE SAINT POET OBSERVED 

 AHOBILA MUTT PONTIFF DELIVERS SPIRITUAL MESSAGE 

Tirumala, 08 April 2021:The serene precincts of Tirumala reverberated to the melodious notes of Annamaiah Sankeertans rendered by the artists of the Annamacharya Project on the occasion of the 518th Death Anniversary of the saint-poet Sri Tallapaka Annamacharya.

Sriman Srivan Satagopa Ranganatha Yateendra Mahadesikan Swami, the 46th Pontiff of Ahobila Mutt in his Anugraha Bhashanam said there is a great bond between Tirumala and Ahobilam. Likewise, a great bond exists between Sri Mahadesikan and Annamacharya. On Acharya Mahadesikan’s advice, only Annamacharya penned 32thousnd Sankeertans signifying the 32letter Beejakshara mantra as taught by him.

He also said though there are many devotional sankeertanas even in other languages, the beauty of Telugu Sankeertans penned by Annamacharya in praise of Sri Venkateswara as well on Ahobila Narasimha are beyond comparison.

The seer also complimented TTD for organising Parayanams and various devotional programs to overcome the bad effects of the Corona Covid virus.

Later EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti felicitated the Pontiff on the occasion and took his blessings.

The descendants of Annamacharya were also felicitated on the occasion.

Annamacharya Project Director Sri Dakshinamurthy carried out the proceedings of the programme.

Earlier the senior artists of the Annamacharya Project rendered Sapthagiri Sankeertana Gosthi Ganam in a melodious manner in the divine presence of Sri Malayappa Swamy, Sridevi and Bhudevi on a finely decked swing at Narayanagiri Gardens.

The entire event lasted for nearly two hours in a grand manner amidst Covid guidelines.

VGO Sri Bali reddy, temple peishkar Sri Srihari and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్నమయ్య సంకీర్తన‌ల‌తో పులకించిన స‌ప్త‌గిరులు

తిరుమలలో ఘనంగా అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు

తిరుమల, 2021 ఏప్రిల్ 08: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో గురువారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఊంజల్‌సేవలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంతో స‌ప్త‌గిరులు పులకించాయి. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు. అన్నమయ్యకు, వారి ఆచార్యపీఠమైన అహోబిల మఠానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. అన్నమయ్య విద్యాభ్యాసం, వేదశాస్త్రాల అధ్యయనం ఇక్కడే సాగిందని చెప్పారు. అహోబిలం శ్రీ నరసింహస్వామివారి అనుగ్రహంతో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు దీక్ష పొంది మంత్రోపదేశం పొందారని వివరించారు. ఈ మంత్రోపదేశంలోని 32 బీజాక్షరాలతో అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించారన్నారు. అనేక భాష‌ల్లో శ్రీ‌వారిపై వేలాది సంకీర్త‌న‌లు ఉన్న, తేట తెలుగులో అన్న‌మ‌య్య ర‌చించిన సంకీర్త‌న‌లు అద్భుతం అన్నారు. అన్నమయ్య సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం వినేందుకే ప్రతి ఏడాదీ ఇక్కడికి వస్తున్నట్టు చెప్పారు. టిటిడి అధికారులు క‌రోనా వంటి విప‌త్క‌ర కాలంలో పారాయ‌ణం, అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారని అభినందించారు.

టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి మాట్లాడుతూ సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతి మహోత్సవాలు తిరుమలలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా తిరుప‌తి, తాళ్ళ‌పాకలో కూడా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు. రాబోవు రోజులలో అన్నమయ్య వర్ధంతి, జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

ముందుగా నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంలో భాగంగా ”దినము ద్వాదశి నేడు…, భావములోన బాహ్యము నందును…., బ్రహ్మ కడిగిన పాదము…, ఎంత మాత్రమున ఎవ్వరు దలిచిన…., పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా…., కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు…., నారాయణతే నమో నమో…., ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు…., ” కీర్తనలను కళాకారులు రసరమ్యంగా గానం చేశారు. వీరిలో టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ పి.రంగ‌నాథ్‌, శ్రీ బి.ర‌ఘునాథ్‌, శ్రీ‌మ‌తి బుల్లెమ్మ‌, శ్రీ‌మ‌తి విశాలాక్ష్మితో పాటు హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ‌మ‌తి టి.శ్రీ‌నిధి, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భజన బృందాల సభ్యులు ఉన్నారు.

అనంతరం అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామివారిని టిటిడి ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి కలసి శాలువ, శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు. అహోబిల మఠం తరఫున టిటిడి ఈవో, అద‌న‌పు ఈవోను సన్మానించారు. అనంతరం టిటిడి తరఫున తాళ్లపాక వంశీయుల‌ను సత్కరించారు.

అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.