TIRUMALA SPECIAL OFFICER REVIEWS ON PREZ VISIT ARRANGEMENTS_ భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్ తిరుమల పర్యటన ఏర్పాట్లపై ప్ర‌త్యేకాధికారి సమీక్ష
By TTD News On 12 Jul, 2019 At 04:41 PM | Categorized As General News

Tirumala, 12 Jul. 19: The Special Officer of Tirumala, Sri A V Dharma Reddy reviewed on the arrangements to be made by various departments of TTD in connection with the visit by H.E. the Honourable President of India Sri Ramnath Kovind to Tirumala on July 13 and 14.

The review meeting with the HoDs of various departments took place at Annamaiah Bhavan in Tirumala on Friday evening. The Special Officer directed the Vigilance, Reception, Temple, Engineering, Annaprasadam, Transport and Health Wings to be more alert in the executing their duties at all the VIP points including the rest house areas, Mahadwaram, VQC etc. Keeping in view the past experiences, he asked every department to be more attentive in discharging their duties with out giving scope to any hindrance during the visit of the first citizen of the Nation.

CVSO Sri Gopinath Jatti, Additional CVSO Sri Siva Kumar Reddy, SEs Sri Ramachandra Reddy, Sri Venkateswarulu, GM Transport and IT Head Sri Sesha Reddy, Spl.Gr.DyEO Smt Parvathi, DyEOs Sri Harindranath, Sri Balaji, Smt Nagarathna, Special Officer Annaprasadam Sri Venugopal, VSOs Sri Manohar, Sri Prabhakar and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్ తిరుమల పర్యటన ఏర్పాట్లపై ప్ర‌త్యేకాధికారి సమీక్ష

తిరుమల, 2019 జూలై 12: భారత రాష్ట్ర‌ప‌తి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్ జూలై 13,14వ‌ తేదీల‌లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేయనున్నారని, ఇందుకోసం ఆయా విభాగాల అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్ర‌త్యేకాధికారి వివిధ విభాగాల అధికారులతో శుక్ర‌వారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్ర‌త్యేకాధికారి మాట్లాడుతూ టిటిడి అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని గౌ|| రాష్ట్ర‌ప‌తి తిరుమలకు చేరుకుని తిరిగి వెళ్లే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రతకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. శ్రీవారి ఆలయం, రిసెప్షన్‌, ఇంజినీరింగ్‌, అన్నప్రసాదం, ఎఫ్‌ఎంఎస్‌, ఆరోగ్య విభాగం, ప్ర‌జాసంబంధాలు, వైద్యం, క‌ల్యాణ‌క‌ట్ట‌ తదితర విభాగాల వారీగా సమీక్షించి ఏర్పాట్లపై చర్చించారు.

ఈ సమావేశంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్ రెడ్డి, ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, ఎస్‌ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్‌, శ్రీ బాలాజీ, ర‌వాణావిభాగం మ‌రియు ఐటి అధికారి శ్రీ శేష‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా..ఆర్‌.ఆర్‌.రెడ్డి, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, విఎస్‌వోలు శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v