TTD COMMITTED TO PROTECT AND PROPAGATE VEDAS, SAYS ADDL. EO _ వేద ప‌రిర‌క్ష‌ణ‌, ప్ర‌చారానికి టిటిడి కృషి: టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

AKHILA BHARAT VEDA SHASTRA AGAMA VIDWAT SADASSU BEGINS

Tirumala, 25 Feb. 20: TTD Additional Executive Officer Sri AV Dharma Reddy said on Tuesday that TTD is making all out efforts for protection and propagation of Vedas as part of its commitment for promotion of sanatana Hindu dharma.

Addressing as Chief Guest of the 28thAkhila Bharat Veda Shastra Agama Vidwat Sadassu at the SV Veda Vignana Peetham, Dharmagiri the Additional EO said as part of above agenda the TTD had got up the Dharmagiri institute and several other Veda pathasalas in Telugu states besides the Veda university at Tirupati. Similarly TTD is providing financial assistance to Veda parayanadars and also aged Veda pundits.

He said it is bounded duty to protect Vedas as part of rich Indian culture and traditions for benefit of future generations.

He said the TTD has made all arrangements for the 727 students and 104 Vedic exponents cum invigilators for the Vedic exams which will be conducted as part of the Sadassu from February 25-March 1.

The six day all India Sadassu is being conducted at a cost of Rs 2 crores and the TTD will present 10 gms of gold and 10gms silver dollars to first and second rankers besides certificates, cash purse and shawls to pundits in the Veda exams.

Veda mantras a favourite of Srinivasa, says Sri Sri Sri Vidya Shankar Saraswati Swamy.

Veda pathana was a favourite of Lord Venkateswara and study of Vedas in the land of Adi Varaha was a blessing for Vedic students of Dharmagiri, said Sri Sri Sri Vidya Shankar Saraswati Swamy, Pontiff of Vidya Narasimha ashram, Nerur, near Srirangam in Tamil Nadu.

Presenting his keynote address at the Sadassu the pontiff lauded efforts of TTD in promotion of Veda study and said Vedic studies lasted forever in comparison to general studies. He exhorted students to be not scared of examinations, which only further embellished their knowledge base and future.

Acharya Rajagopalan, Secretary of TTDs HDPP Highlighted the various programs launched by TTD for Veda study promotion like Veda Parayanam, Kumar adhyapaka scheme, ahitagnula Parirakshna pathakam and Vruddha Agama Panditula pathakam which finances the aged pundits.

TTD has recently decided to enhance the financial assistance to Veda pathasalas across the country.

The principal and secretary of the Sadassu Sri Kuppa Shiva Subramanyam Aradhani presented the annual report. Since 1969:TTD is conducting the Sadassus and so far 1213 students had passed out.

He said presently there were 18 faculties including Veda, Agama, Smartha Divya Prabandam and Sanskrit at the Dharmagiri institute.

He said during the six-day Sadassu rituals like special Havana’s will be conducted on the varied traditions of Shouta Yagas, EasternEigveda, Western Yajurveda, southern Sama Veda and northern Atharva a Veda.

He said Brahmarshi Madugula Nagaphani Sharma would present special lectures on Veda-Ramayana, Veda-Mahabharata, and Veda-Bhagavatam on February 27-29.

TTD VSO Sri Manohar, Health Officer Dr RR Reddy, Catering officer Sri GLN Shastri, Veda Pathasala lecturer Sri GAV Dikshitulu, Sri P Seethramacharyulu, Sri SV Mohanarangacharyulu, Sri VN Bhattacharya and others participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వేద ప‌రిర‌క్ష‌ణ‌, ప్ర‌చారానికి టిటిడి కృషి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి
అఖిల‌భార‌త వేదశాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు ప్రారంభం
ఫిబ్రవరి 25, తిరుమ‌ల‌, 2020: వేదాలు సాక్షాత్తు భ‌గ‌వంతుని స్వ‌రూపాల‌ని, స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా వేద ప‌రిర‌క్ష‌ణ‌, ప్ర‌చారానికి టిటిడి విశేష కృషి చేస్తోంద‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలియ‌జేశారు. తిరుమ‌లలోని ధ‌ర్మ‌గిరిలో గ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విజ్ఞాన పీఠంలో 28వ అఖిల‌భార‌త శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు మంగ‌ళ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. మార్చి 1వ తేదీ వ‌ర‌కు 6 రోజుల పాటు ఈ స‌ద‌స్సు జ‌రుగ‌నుంది.
ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అద‌న‌పు ఈవో మాట్లాడుతూ వేద‌విద్య‌ను ప్ర‌చారం చేసేందుకు తిరుప‌తిలో వేద విశ్వ‌విద్యాల‌యంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో వేద పాఠ‌శాల‌ల‌ను టిటిడి నిర్వ‌హిస్తోంద‌న్నారు. అదేవిధంగా, ప‌లు ప‌థ‌కాల ద్వారా వేద‌పారాయ‌ణ‌దారుల‌కు, వృద్ధ పండితుల‌కు ఆర్థిక‌సాయం అందిస్తున్న‌ట్టు తెలిపారు. భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాలు గొప్ప‌వ‌ని, వేద పండితులు వాటిని భావిత‌రాల‌కు అందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అన్నారు. వేద స‌ద‌స్సులో భాగంగా ప‌రీక్ష‌ల కోసం దేశం న‌లుమూల‌ల నుండి 727 మంది విద్యార్థులు, 104 మంది ప‌రీక్షాధికారులు విచ్చేశార‌ని, వీరంద‌రికీ చ‌క్క‌టి సౌక‌ర్యాలు క‌ల్పించామ‌ని తెలిపారు. ఈ ప‌రీక్ష‌ల్లో ప్ర‌థ‌మ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి 5 గ్రాముల బంగారు ప‌త‌కం, ద్వితీయ శ్రేణిలో నిలిచిన వారికి 10 గ్రాముల వెండి ప‌త‌కం బ‌హుమానంగా అందిస్తామ‌ని, వీటితోపాటు న‌గ‌దు బ‌హుమ‌తి, స‌ర్టిఫికేట్‌, పండిత శాలువా ప్ర‌దానం చేస్తామ‌ని వెల్ల‌డించారు.  సుమారు రూ.2 కోట్ల వ్య‌యంతో ఈ వేద స‌ద‌స్సును టిటిడి నిర్వ‌హిస్తోంద‌ని, వేద విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.
వేద‌మంత్రం శ్రీ‌నివాసునికి ప్రీతిక‌రం : శ్రీ‌శ్రీ‌శ్రీ విద్య‌శంక‌రస‌ర‌స్వ‌తి స్వామీజీ
క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి వేద‌మంత్రోచ్ఛార‌ణ ప్రీతిక‌ర‌మైంద‌ని, ఆదివ‌రాహ‌క్షేత్ర‌మైన తిరుమ‌ల‌లో వేద‌విద్య‌ను అభ్య‌సించ‌డం విద్యార్థుల పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని త‌మిళ‌నాడులోని శ్రీ‌రంగం వ‌ద్ద గ‌ల నెరూరుకు చెందిన విద్యాన‌ర‌సింహ ఆశ్ర‌మ పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యాశంక‌రస‌ర‌స్వ‌తి స్వామీజీ ఉద్ఘాటించారు.
స్వామీజీ అనుగ్ర‌హ‌భాష‌ణం చేస్తూ వేదోక్తంగా చేసే ఏప‌ని అయినా ధ‌ర్మ‌బ‌ద్ధంగా ఉంటుంద‌న్నారు. వేదంలో ధార‌ణ ప్ర‌ధాన‌మ‌ని, విద్యార్థులు శ్ర‌ద్ధ‌గా వేద విద్య‌ను సాధ‌న చేయాల‌ని సూచించారు. శ్ర‌ద్ధ వ‌ల్ల జ్ఞానం, జ్ఞానం వ‌ల్ల కైవ‌ల్యం సిద్ధిస్తాయ‌ని తెలిపారు. లౌకిక విద్య కొంత కాలం మాత్ర‌మే గుర్తుంటుంద‌ని, వైదిక విద్య శ‌రీరం ఉన్నంత వ‌ర‌కు ఉంటుంద‌ని వివ‌రించారు. ప‌రీక్ష‌లంటే విద్యార్థుల‌కు భ‌యం ఉండ‌కూడ‌ద‌ని, వీటివ‌ల్ల మ‌రింత ప్ర‌కాశ‌వంతుల‌వుతార‌ని తెలియ‌జేశారు.
టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్ మాట్లాడుతూ వేద ప‌రిర‌క్ష‌ణ‌కు టిటిడి విశేషంగా కృషి చేస్తోంద‌ని తెలిపారు. వేదపారాయణ పథకం, కుమార అధ్యాపక పథకం, ఆహితాగ్నుల పరిరక్షణ పథకం, వృద్ధ ఆగమ పండితుల పరిరక్షణ పథకం తదితర పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంద‌ని, ఆయా ప‌థ‌కాల్లో పండితుల సంఖ్య‌ను పెంచేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని వివ‌రించారు. దేశ‌వ్యాప్తంగా ప‌లు వేద పాఠ‌శాల‌ల‌కు ఆర్థిక సాయం అందిస్తున్న‌ట్టు తెలిపారు. త‌న తండ్రి శ్రీ సుంద‌రాచార్యులు ఈ వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్‌గా సేవ‌లందించార‌ని, చిన్న‌ప్ప‌టినుండి ఈ స‌ద‌స్సుల‌తో అనుబంధం ఉంద‌ని గుర్తు చేసుకున్నారు.
వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌, స‌ద‌స్సు కార్య‌ద‌ర్శి శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవ‌ధాని వార్షిక నివేదిక‌ను వినిపించారు. 1969వ సంవ‌త్సంలో టిటిడి ఈ స‌ద‌స్సుల‌ను ప్రారంభించింద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు 1213 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణుల‌య్యార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం వేద పాఠ‌శాల‌లో వేద‌, ఆగ‌మ‌, స్మార్త‌, దివ్య‌ప్ర‌బంధం, సంస్కృతం క‌లిపి 18 విభాగాల్లో కోర్సులున్నాయ‌న్నారు. ఈ స‌ద‌స్సులు జ‌రిగే 6 రోజుల పాటు శ్రౌత యాగాలు, తూర్పున రుగ్వేదం, ప‌శ్చిమాన య‌జుర్వేదం, ద‌క్షిణాన సామ‌వేదం, ఉత్త‌రాన అధర్వ‌ణ వేదాల‌తో హ‌వ‌నాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఫిబ్ర‌వ‌రి 27 నుండి 29వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మశ్రీ మాడుగుల నాగ‌ఫ‌ణిశ‌ర్మ వేదం-రామాయ‌ణం, వేదం – మ‌హాభార‌తం, వేదం – భాగ‌వ‌తం అనే అంశాల‌పై ఉప‌న్యాసం ఉంటుంద‌ని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి విఎస్వో శ్రీ మనోహర్, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, క్యాటరింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి, వేద పాఠశాల ఆధ్యాపకులు శ్రీ జిఎవి.దీక్షితులు, శ్రీ పి.సీతారామాచార్యులు, శ్రీ ఎన్వి.మోహనరంగాచార్యులు, శ్రీ విఎన్.భట్టాచార్య ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.