TTD GETS READY TO COPE UP THE SUMMER RUSH_ వేసవిలో భ‌క్తుల‌కు ప్ర‌త్యేక‌ ఏర్పాట్లు : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు
By TTD News On 16 Apr, 2019 At 05:35 PM | Categorized As General News

Tirumala, 16 Apr. 19: With just a week to go to experience the peak summer pilgrim rush in a full-fledged manner, TTD has already commenced its preparations to attend to the needs of the scores of visiting pilgrims during vacation.
In view of the ensuing summer season, Tirumala JEO Sri KS Sreenivasa Raju had reviewed with all the senior officers and HoDs of TTD stationed in Tirumala on the Summer arrangements at Annamayya Bhavan on Tuesday.

ENGINEERING WORKS

The JEO instructed the Engineering officials to apply white cool cem paint in all the places where pilgrim movement is heavy and arrange necessary shelter to overcome the scorching temperatures. He also directed them to provide umbrellas in all vital service points where Srivari Seva volunteers render service viz.in four mada streets, outside queue lines in Narayanagiri Gardens etc. The JEO also instructed them to erect No Parking Boards wherever necessary in consultation with the Vigilance and Security wing officials. About 3500 Srivari Sevakulu and 500 Scouts will be invited for pilgrim service.

DARSHAN TO PROTOCOL VIPs ONLY

Keeping in view the heavy influx of pilgrims during the ensuing summer, TTD has limited the VIP break darshan to only Protocol VIPs on Fridays, Saturdays and Sundays.

WATER TUBS TO QUENCH THIRST OF FAUNA

The JEO instructed the Forest officials of TTD to ensure that the water tubs set up at both ghat roads and in Kakulakonda should be filled with water to quench the thirst of wild animals in the summer season.

DEPLOYMENT OF VOLUNTEERS AND SCOUTS

He instructed concerned HoDs to deploy sufficient number of Srivari Seva Volunteers and Scouts to offer services to the pilgrims who throng Tirumala during peak summer season. The JEO also asked the officials concerned to ensure that the Pilgrim Welfare Facilitation Service (PWFS) which was introduced on a trial basis recently in Vaikuntham compartments should function in an efficient way and directed the departments including Annaprasadam, Health, Medical, Electrical and Security to attend to the calls to resolve the issues with immediate effect in compartments.

DEPUTATION OF OFFICERS

To ensure smooth darshan to pilgrims during summer, the JEO instructed the concerned to deploy senior officers on special duties especially during Saturdays and Sundays in three shifts in Tirumala covering all vital locations like Sarva Darshanam, Divya Darshanam and Special Entry Darshanam complexes, Alwar Tank, MBC 26, SV Rest House and one set of officers for two sheds in Narayanagiri Gardens in Tirumala during Summer season.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వేసవిలో భ‌క్తుల‌కు ప్ర‌త్యేక‌ ఏర్పాట్లు : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు

ఏప్రిల్ 16, తిరుమ‌ల‌, 2019: వేస‌విలో తిరుమ‌ల‌లో భ‌క్తుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిటి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు తెలిపారు. వేస‌వి ఏర్పాట్ల‌పై తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం అధికారుల‌తో జెఈవో స‌మావేశం నిర్వ‌హించారు.

స‌మావేశం అనంత‌రం జెఈవో మీడియాతో మాట్లాడుతూ న‌డ‌క‌దారులు, తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల‌తోపాటు ఇత‌ర ప్రాంతాల్లో త‌ర‌చుగా వైట్ కూల్ పెయింట్ వేసి కాలిన‌డ‌క భ‌క్తుల‌కు ఎండ వేడి నుండి ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌ధాన క‌ల్యాణ‌క‌ట్ట నుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 వ‌ర‌కు శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న‌ షెడ్లు ఏర్పాటు చేశామ‌ని, మాడ వీధుల్లో స్పింక్ల‌ర్ల ద్వారా నీటితో చ‌ల్ల‌బ‌రుస్తున్నామ‌ని చెప్పారు. వేస‌వి ర‌ద్దీ నేప‌థ్యంలో ఏప్రిల్ 16 నుండి జూలై 14వ తేదీ వ‌రకు శుక్ర‌, శ‌ని, ఆదివారాల్లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశామ‌ని, విఐపిలు స‌హ‌క‌రించాల‌ని కోరారు. వేస‌విలో భ‌క్తులు నీటి వృథాను అరిక‌ట్టాల‌ని కోరారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం ఆరు చోట్ల తాత్కాలిక ప్రాతిప‌దికన అద‌న‌పు ల‌గేజి డిపాజిట్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. 3,500 మంది శ్రీ‌వారి సేవ‌కులు, 500 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా భ‌క్తుల‌కు సేవ‌లందిస్తామ‌ని తెలిపారు. టిటిడి విద్యాసంస్థ‌ల‌కు వేస‌వి సెల‌వులు రానుండ‌డంతో అక్క‌డి అటెండ‌ర్ల‌ను డెప్యుటేష‌న్‌పై ర‌ప్పించి కంపార్ట్‌మెంట్ల‌లో భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లందిస్తామ‌న్నారు. మెరుగైన పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని, భక్తులకు అవసరమైనన్ని లడ్డూల త‌యారుచేసేందుకు పోటు సిబ్బంది సిద్ధంగా ఉన్నార‌ని వివ‌రించారు.

టైంస్లాట్ ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తులు స‌మ‌య‌పాల‌న పాటించాల‌ని జెఈవో కోరారు. ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించే శ్రీ‌వారి సేవ‌కులు ఎండ‌కు ఇబ్బంది ప‌డ‌కుండా గొడుగులు అందిస్తామ‌న్నారు. తిరుమ‌ల ఘాట్ రోడ్లు, కాకుల‌కొండ ప్రాంతాల్లో అడ‌వి జంతులు దాహార్తిని తీర్చేందుకు తొట్టెల్లో నీటిని నింపాల‌ని సిబ్బందికి సూచించిన‌ట్టు తెలిపారు. ఎలాంటి అంత‌రాయం లేకుండా విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేలా చూస్తామ‌న్నారు. భ‌క్తుల కోసం గ్లూకోజ్‌, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాల‌ని వైద్య విభాగం అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు తెలిపారు. నారాయణగిరి ఉద్యానవనాలు, సర్వదర్శనం, దివ్యదర్శనం కాంప్లెక్స్‌లు, ఆళ్వార్ ట్యాంక్‌, ఎస్వీ మ్యూజియం, ఎస్వీ విశ్రాంతిగృహం వ‌ద్ద గ‌ల క్యూలైన్ల‌లో భ‌క్తుల సౌక‌ర్యాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు సీనియ‌ర్ అధికారులకు బాధ్య‌త‌లు కేటాయిస్తామ‌ని వివ‌రించారు.

ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు సివిఎస్‌వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v