TTD INVITES APPLICATIONS FOR FIRST PHASE KALYANAMASTU ON MAY 28 _ మే 28న క‌ల్యాణమ‌స్తు ద‌ర‌ఖాస్తులకు టీటీడీ ఆహ్వానం

Tirupati, 26 Mar. 21: As part of its agenda to promote Sanatana Hindu Dharma, TTD has decided to revive the Kalyanamastu (community wedding ceremony for the poor) program.

TTD is contemplating to conduct the program on a big scale at present in all 13 district headquarters of AP and has invited applications from interested unmarried youth wanting to participate in the Sri Kalyanamastu program during the first phase which is scheduled on May 28.

Model applications can be downloaded from the TTD website www.tirumala.org or can be procured from the HDPP program assistants of the respective Districts.

The completely filled applications with all details should be submitted before April 25 at the office of Srivari Kalyana Mandapams in the district headquarters of each district in AP.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

మే 28న క‌ల్యాణమ‌స్తు ద‌ర‌ఖాస్తులకు టీటీడీ ఆహ్వానం

తిరుపతి, 2021 మార్చి 26: స‌నాత‌న హైంద‌వ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మే 28వ తేదీ క‌ల్యాణమ‌స్తు సామూహిక వివాహాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.
కళ్యాణమస్తు లో వివాహం చేసుకోవడానికి ఆసక్తి గల అవివాహితులైన యువ‌తీ యువ‌కుల నుండి టిటిడి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. టిటిడి గతంలో పెద్ద ఎత్తున కల్యాణ మస్తు సామూహిక వివాహాల కార్యక్రమం నిర్వహించిన విష‌యం తెలిసిందే.

ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 13 జిల్లా కేంద్రాలతో పాటు తిరుపతిలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, ద‌ర‌ఖాస్తు ప‌త్ర‌ములు www.tirumala.org నుండి కానీ, ఆయా జిల్లాల హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ప్రోగ్రాం అసిస్టెంట్స్ నుండి గానీ పొంద‌వ‌చ్చు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను ఏప్రిల్ 25వ తేదీ లోపు ఆయా జిల్లా కేంద్రాల‌ల్లోని క‌ల్యాణ మండ‌పాల కార్యా‌ల‌యాల‌కు చేర్చాల్సి ఉంటుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.