TTD NETS RS. 1.25CR_ తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 1.25 కోట్లు
By TTD News On 16 May, 2019 At 05:16 PM | Categorized As Press Releases

Tirumala, 16 May 19: In the human hair e-auction held on Thursday, TTD has garnered Rs.1.25crores.

About 600 kilos of first and second varieties of human hair were bid in stock fetching TTD a revenue of over 10 millions.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 1.25 కోట్లు

తిరుమల, 2019 మే 16: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలం గురువారం నిర్వ‌హించారు. త‌ద్వారా టిటిడి రూ. 1.25 కోట్ల ఆదాయాన్ని గడించింది.

ఇందులో భాగంగా తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు) టిటిడి ఈ-వేలం నిర్వహించారు. ఈ-వేలంలో మొత్తం 600 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

మొదటి ర‌కం తలనీలాలు కిలో రూ.22,502/-గా ఉన్న 2,500 కిలోలను వేలానికి ఉంచగా 400 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.90.01 లక్షల ఆదాయం సమకూరింది.

రెండో రకం తలనీలాలు కిలో రూ.17,260/-గా ఉన్న 27,600 కిలోలను వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.34.52 లక్షల ఆదాయం సమకూరింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v