TTD NETS 7.94CRORES IN E AUCTION OF HUMAN HAIR_ తలనీలాల ఈ-వేలం ద్వారా రూ.7.94 కోట్లు ఆదాయం
By TTD News On 21 Feb, 2019 At 06:54 PM | Categorized As Press Releases

Tirumala, 21 Feb. 19: In the e-Auction of 4,300 kilos of first and second varieties of human hair held on Thursday, TTD has net Rs.7.94crores.

This was held under the supervision of Tirumala JEO Sri KS Sreenivasa Raju on e-platform.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తలనీలాల ఈ-వేలం ద్వారా రూ.7.94 కోట్లు ఆదాయం

తిరుమల, 2019 ఫిబ్ర‌వ‌రి 21: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ. 7.94 కోట్ల ఆదాయాన్ని గడించింది. పాత వెరైటీల‌కు సంబంధించి మొదటి, రెండవ తలనీలాల రకాలకు గురువారం ఈ-వేలం నిర్వహించారు. ఈ-వేలంలో మొత్తం 4,300 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

కిలో రూ.22,499/-గా ఉన్న మొదటి ర‌కం తలనీలాల‌ను(31 ఇంచుల పైన‌) 4,100 కిలోల‌ను వేలానికి ఉంచ‌గా 1,000 కిలోలు అమ్ముడుపోయాయి. త‌ద్వారా 2.25 కోట్ల ఆదాయం వ‌చ్చింది.

కిలో రూ.17,250/-గా ఉన్న రెండో ర‌కం తలనీలాల‌ను(16 నుండి 30 ఇంచుల లోపు) 30,900 కిలోల‌ను వేలానికి ఉంచ‌గా 3,300 కిలోలు అమ్ముడుపోయాయి. త‌ద్వారా 5.69 కోట్ల ఆదాయం ల‌భించింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v