TTD SUCCOUR TO DESTITUTE- TTD JEO (E&H) _ అభాగ్యుల‌కు టిటిడి ఆప‌న్న‌హ‌స్తం : టిటిడి జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

Tirupati, 14 March 2022:TTD JEO (Education & Health) Smt Sada Bhargavi directed officials on Monday to prepare an action plan to round up orphans, beggars and destitute roaming in and around Tirupati city and admit them to SV Poor Home and SV Bala mandir to provide them a bright future.

Addressing representatives of Sri Ramakrishna Mission, ISKCON and other organisations at her chambers’ in the TTD Administrative Building, the TTD JEO said the new program is initiated as per directions of TTD EO Dr KS Jawahar Reddy to provide Srivari blessings and succour to orphans, abandoned, destitute starving on roads of pilgrim city of Tirupati. The assistance already given by some organisations should be brought under the umbrella of SV Sarvasreyas Trust through financial assistance and other logistic support.

She asked TTD officials to prepare an action plan and if necessary, support from governmental organisations like IPDS and municipalities will also be roped in.

The program envisaged the provision of food, accommodation, clothing, and education to these sections of children to shape up with a bright future for them. Similarly, destitute women may be provided shelter at SV Poor Home and give them mental happiness through Srivari blessings, which is also a part of TTD’s agenda.

She said the program will be initiated in Tirupati city during the first phase and later extended to other districts and the entire state in future.

TTD proposes to conduct two more sessions with voluntary organisations on the issue and one representative from each organisation will be selected and trained to implement the noble agenda, she added.

Smt Sridevi and Sri Viswaraj Anand from Ramakrishna Mission, Sri Mohan Govind Das and Sri Madhugopal Haridas from ISKCON, TTD DyEO cum DEO Sri Govindarajan, DyEO Sri Rama Rao, and SV Poor Home Medical Officer Dr Bharat were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అభాగ్యుల‌కు టిటిడి ఆప‌న్న‌హ‌స్తం : టిటిడి జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుపతి, 2022 మార్చి 14: తిరుప‌తి న‌గ‌రంలో రోడ్ల‌పై సంచ‌రిస్తున్న అనాథ‌ల‌ను, అభాగ్యుల‌ను చేర‌దీసి అంద‌రినీ ఎస్వీ పూర్ హోమ్‌, ఎస్వీబాల‌మందిరంలో చేర్పించి చ‌క్క‌టి భ‌విష్య‌త్తు ఇచ్చేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని టిటిడి జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల కార్యాల‌యంలో జెఈవో సోమ‌వారం రామ‌కృష్ణ మిష‌న్‌, ఇస్కాన్ త‌దిత‌ర సంస్థ‌ల ప్ర‌తినిధులతో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆలోచ‌న‌ల మేర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌న్నారు. ఎంతోమంది అనాథ‌లు రోడ్ల‌పై తిరుగుతున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కుంగి కుశించిపోతున్నార‌ని, వీరికి శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆశీస్సులు అందాల‌ని చెప్పారు. ఇలాంటి వారికి కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు కొంత మేర‌కు స‌హాయం చేస్తున్నార‌ని, అలాంటి సంస్థ‌ల‌న్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎస్వీ స‌ర్వ‌శ్రేయ ట్ర‌స్టు ద్వారా ఇలాంటి సంస్థ‌ల‌కు ప‌లు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నామ‌ని, చ‌క్క‌టి సేవ‌లందించే ఇలాంటి సంస్థ‌ల‌కు భ‌విష్య‌త్తులో మ‌రింత స‌హ‌కారం అందిస్తామ‌ని తెలిపారు. ఇందుకోసం ఒక కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని, అవ‌స‌ర‌మైన ప‌క్షంలో ప్రభుత్వ సంస్థ‌లైన ఐసిడిఎస్‌, మున్సిపాలిటీల నుండి స‌హ‌కారం తీసుకుంటామ‌న్నారు.

వీధుల్లో తిరిగే పిల్ల‌ల‌కు చ‌క్క‌టి భ‌విష్య‌త్తు ఉంటుందని, వారు అనాథ‌లుగా మిగిలిపోకుండా చేర‌దీసి వ‌స‌తి, భోజ‌నం, బ‌ట్ట‌లు అందించి చ‌క్క‌టి విద్య‌ను అందించ‌డం ద్వారా మంచి భ‌విష్య‌త్తును క‌ల్పించిన‌వారిమ‌వుతామ‌ని జెఈవో చెప్పారు. అదేవిధంగా నిరాశ్ర‌యులైన మ‌హిళ‌లు, పురుషుల‌కు ఎస్వీ పూర్‌హోమ్‌లో ఆశ్ర‌యం క‌ల్పించి, వారికి మాన‌సిక వికాసం క‌ల్పించ‌డం ద్వారా స్వామివారి ఆశీస్సులు అందించిన‌ట్టు అవుతుంద‌న్నారు. మొద‌ట‌ తిరుప‌తి న‌గ‌రంతో ప్రారంభించి ఆ త‌రువాత జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభాగ్యుల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించాల‌ని సూచించారు. ఈ అంశంపై స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌తో మ‌రో రెండు స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఈ సంస్థ‌ల నుండి ఒక ప్ర‌తినిధిని ఎంపిక చేసి త‌గిన శిక్ష‌ణ ఇచ్చి, వారి ద్వారా అభాగ్యుల‌కు ప్రేమ‌పూర్వ‌క‌మైన సేవ అందించాల‌ని కోరారు.

ఈ స‌మావేశంలో రామ‌కృష్ణ మ‌ఠానికి చెందిన శ్రీ‌మ‌తి శ్రీ‌దేవి, శ్రీ విశ్వ‌రాజ ఆనంద్, ఇస్కాన్‌కు చెందిన శ్రీ మోహ‌న్ గోవిందదాస్‌, శ్రీ మ‌ధుగోపాల హ‌రిదాస్‌, విద్యాశాఖాధికారి శ్రీ గోవింద‌రాజ‌న్‌, డెప్యూటీ ఈవో శ్రీ రామారావు, ఎస్వీ పూర్ హోమ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ భ‌ర‌త్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.