TTD TO OPEN UP ITS REST HOUSES FOR PILGRIMS FROM DECEMBER 15 ONWARDS _ డిసెంబ‌రు 15 నుండి శ్రీ‌నివాసం, మాధ‌వంలో గ‌దుల కేటాయింపు

Tirupati, 8 Dec. 20: TTD will be resuming allotment of its rest houses to pilgrims in Tirupati from December 15 onwards.

As the TTD rest houses including Madhavam, Srinivasam and Vishnu Nivasam were handed over to district administration, which turned into Covid care centres for quite sometime, the allotment to pilgrims was temporarily stalled by TTD.

But as now the Covid cases have decreased, the rest houses were handed over back to TTD. The online quota booking will be enabled on December 10 in www.tirupatibalaji.ap.gov.in and the devotees shall book their accommodation from December 15 onwards.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబ‌రు 15 నుండి శ్రీ‌నివాసం, మాధ‌వంలో గ‌దుల కేటాయింపు

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 08: శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుప‌తిలోని శ్రీ‌నివాసం, మాధ‌వం వ‌స‌తి స‌ముదాయాల్లోని గ‌దుల‌ను డిసెంబరు 15వ తేదీ నుండి భ‌క్తుల‌కు కేటాయిస్తారు. ఈ స‌ముదాయాల్లోని గ‌దులు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం డిసెంబ‌రు 10వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో గ‌దుల‌ను బుక్ చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా భ‌క్తులు గ‌దుల‌ను బుక్ చేసుకోవ‌చ్చు.

కోవిడ్‌-19 నేప‌థ్యంలో శ్రీ‌నివాసం, మాధ‌వం వ‌స‌తి స‌ముదాయాల‌ను కొంత కాలం పాటు క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించారు. కేసులు త‌గ్గ‌డంతో క్వారంటైన్ కేంద్రాల‌ను ఎత్తేశారు. గ‌దుల‌ను ద‌శ‌ల‌వారీగా పూర్తిగా శానిటైజ్ చేసి భ‌క్తుల‌కు కేటాయించేందుకు సిద్ధం చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.