TTD TO PROVIDE 4000 TOKENS TO AGED AND PHYSICALLY CHALLENGED ON SEPTEMBER 13 AND 20_ సెప్టెంబరు 13, 20వ తేదీలలో వయో వృద్ధులకు, దివ్యాంగులకు
By TTD News On 9 Sep, 2017 At 05:43 PM | Categorized As Press Releases

DARSHAN FOR PARENTS WITH CHILDREN BELOW 5 YEARS ON SEPTEMBER 14 AND 21

Tirumala, 9 September 2017: With a noble intention to facilitate more number of pilgrims falling into the category of aged, physically challenged and parents with children below five years age, TTD has introduced privilege darshan to more number of pilgrims on any two days during lean season in a month.

This month, aged (above 65years) and physically challenged pilgrims will be provided on September 13 and 20respectively. On these two days, 1000 tokens each will be issued during 10 am and 3pm slots and 2000 tokens in 2pmslot. While, the darshan for parents with children below five years will be provided with privilege darshan on September 14 and 21. They will be allowed for darshan from 9 am till 1:30pm on these two days.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

సెప్టెంబరు 13, 20వ తేదీలలో వయో వృద్ధులకు, దివ్యాంగులకు

సెప్టెంబర్‌ 14, 21వ తేదీలలో 5 సం|| లోపు పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

తిరుమల, 2017 సెప్టెంబరు 09: ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారిదర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.

ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 13, 20వ తేదీలలో వయోవృద్ధులు (65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10.00 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు, మధ్యాహ్నం 2.00 గంటలకు 2 వేల టోకెన్లు జారీ చేయనున్నారు.

5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను సెప్టెంబర్‌ 14, 21వ తేదీలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am