TTDCHAIRMAN INSPECTS SMC AREA _ ఎస్ఎమ్‌సి వ‌స‌తి స‌మూదాయాలు, మ‌హాల‌క్ష్మి నిల‌యంను ప‌రిశీలించిన టిటిడి ఛైర్మ‌న్‌

Tirumala, 29 Feb. 20 ;TTD Trust Board Chairman Sri YV Subba Reddy along with TTD Additional EO Sri AV Dharma Reddy inspected rest houses in SMC area and Maha Lakshmi Nilayam on Saturday.

He said, he was inspecting the model rooms in SMC area developed by TTD for the sake of pilgrims with more amenities.

CE Sri Ramachandra Reddy, Health Officer Sri RR Reddy, SE 2 Sri Nageswara Rao, VGO Sri Manohar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్ఎమ్‌సి వ‌స‌తి స‌మూదాయాలు, మ‌హాల‌క్ష్మి నిల‌యంను  ప‌రిశీలించిన టిటిడి ఛైర్మ‌న్‌

తిరుమ‌ల‌, 2020 ఫిబ్ర‌వ‌రి 29 ; తిరుమ‌ల‌లోని శంఖుమిట్ట వ‌స‌తి స‌మూదాయాలు,  శ్రీ‌మ‌హాల‌క్ష్మి నిల‌యం శ‌నివారం టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి, టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఛైర్మ‌న్‌ మాట్లాడుతూ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించాలని, గదులు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. తిరుమ‌ల‌లోని వసతి సముదాయాలలో బెడ్‌షీట్లు, దిండుకవర్లు, కుర్చీల కవర్లను ఎప్పటికప్పుడు మార్చాలని సూచించారు. పారిశుద్ధ్యం కోసం ఆరోగ్యశాఖాధికారులు నిత్యం పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

అనంత‌రం ఇటీవ‌ల‌ ఆధునీక‌రించిన శంఖుమిట్ట (ఎస్ఎమ్‌సి) వ‌స‌తి స‌మూదాయాలలోని గ‌దుల‌లో సీలింగ్‌, గోడ‌లు, ఫ్లోరింగ్‌, బెడ్లు, స్నాన‌పుగ‌దులు, గీజ‌ర్లు, మ‌రుగుదొడ్లు త‌దిత‌ర సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు.

అంత‌కుముందు తిరుమ‌ల శ్రీ‌వారి పోటు కార్మికుల‌ వ‌స‌తి కొర‌కు అత్యాధునిక వ‌స‌తుల‌లో నిర్మించిన మ‌హాల‌క్ష్మీ నిల‌యంలో సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఛైర్మ‌న్ వెంట టిటిడి సిఇ శ్రీ రామ‌చంద్రారెడ్డి, ఆరోగ్య విభాగం అధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వరరావు, విజివో శ్రీ మ‌నోహ‌ర్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.