TWELFTH PHASE SUNDARAKANDA AKHANDA PATHANAM HELD _ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన తిరుమ‌ల గిరులు

ONE YEAR FOR MAHAMANTRA PARAYANAM 

TWELFTH PHASE SUNDARAKANDA AKHANDA PATHANAM HELD 

 Tirumala, 10 Apr. 21: TTD has successfully completed one year of Mahamantra parayanam at Nadaneerajana Mandapam in Tirumala on Saturday.

It may be mentioned here that TTD has commenced the Parayana Yagnam on the same date during last year in Tirumala to overcome the ill effects of Corona Covid 19 virus which shattered the world and bestow the humanity with good health and prosperity by chanting divine mantras.

Stating the same Dharmagiri Veda Pathashala Principal Sri KSS Avadhani said shastras state that any programme when carried out for an year with a noble intention will definitely yield fruitful results.

 TWELFTH PHASE SUNDARAKANDA AKHANDA PATHANAM

 The 12th phase of Sundarakanda Akhanda Pathanam was also held on Sunday.

To enrich the cultural, moral, social, religious and philosophical thoughts of the people particularly among the youth TTD mulled this program which one accolades globally.

So far TTD has successfully conducted 11 Akhanda Parayanams

On Sunday 155 Shlokas from Chapters 49 to 53 of Sundarakanda were recited and nearly 200 Vedic scholars from Dharmagiri Veda Vignana Peetham, Vedic University, National Sanskrit Varsity, SV Higher Vedic Studies, Veda Parayanamdars participated in this mass recitation of Sundarakanda.

Vedic Scholars Sri Pavana Kumara Sharma and Sri Maruthi also accompanied Sri Avadhani during recitation.

Additional EO Sri AV Dharma Reddy, VC of National Sanskrit Varsity Prof.Muralidhara Sharma and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సంవ‌త్స‌రం పూర్తి చేసుకున్న మ‌హామంత్ర పారాయణం

సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన తిరుమ‌ల గిరులు

తిరుమల, 2021 ఏప్రిల్ 10: విశ్వంలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై టిటిడి నిర్వ‌హిస్తున్న మహామంత్ర పారాయణం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసింది.

ఈ సంద‌ర్బంగా ధర్మగిరి వేద పాఠ‌శాల‌ ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్ అవధాని మాట్లాడుతూ కోవిడ్ – 19 వ్యాధిని అరికట్టాలని, లోక క‌ల్యాణార్థం టిటిడి నిర్వ‌హిస్తున్న‌ పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించి నేటికి సంవ‌త్స‌ర‌ము పూర్తి కాగా, ఏప్రిల్ 10వ తేదీకి సుందరకాండ పారాయ‌ణం 304 రోజులు పూర్తి చేసుకుంద‌న్నారు. వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన రామాయ‌ణంలోని సుంద‌ర‌కాండ పారాయ‌ణం వ‌ల‌న బుద్ధి, బ‌లం, ధైర్యం కలిగి స‌కల జీవులు ఆయురారోగ్యాల‌తో ఉంటాయని తెలిపారు. ఒక గొప్ప ఉద్దేశ్యంతో ఏడాది పాటు చేపట్టిన మ‌హామంత్ర పారాయ‌ణం వ‌ల‌న ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయ‌న్నారు.

సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం

సుంద‌ర‌కాండ 12వ విడ‌త అఖండ పారాయ‌ణం ఆదివారం ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు పారాయణం జరిగింది. సుందరకాండలోని 49వ సర్గ నుంచి 53వ సర్గ వరకు ఉన్న 155 శ్లోకాలను అఖండంగా పారాయణం చేశారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు.

12వ‌ విడ‌త‌ అఖండ పారాయ‌ణంలోని 155 శ్లోకాలను శ్రీ ప‌వ‌న్‌కుమార్ శ‌ర్మ‌, శ్రీ మారుతి పారాయ‌ణం చేశారు. జాతీయ సంస్కృత వర్సిటీ అధ్యాప‌కులు ఆచార్య బాల సుబ్ర‌మ‌ణ్యం ” ఏమ‌య్య ర‌ఘు రామ‌య్య‌….., సంకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు మ‌ధుసూద‌న్ రావు బృందం‌ “పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు….. ” సంకీర్తనతో ముగించారు.

ఈ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న సంస్థకు చెందిన వేదపారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్రీయ పండితులు కలిపి దాదాపు 200 మంది పాల్గొన్నా‌రు.

ఈ కార్య‌క్ర‌మంలో అదనపు ఈవో శ్రీ ఎ.వి. ధర్మారెడ్డి దంప‌తులు, జాతీయ సంస్కృత వర్సిటీ ఉప కుల‌ప‌తి ఆచార్య మురళీధరశర్మ, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి శ‌ర్మ, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్ర‌త్యేకాధికారి డా. విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.