UGADI ASTHANAM PERFORMED AT TIRUMALA_ తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఉగాది ఆస్థానం
By TTD News On 6 Apr, 2019 At 03:32 PM | Categorized As Special Gallery

Tirumala, 6 Apr. 19: Ugadi Asthanam heralding the advent of Sri Vikari Nama Samvatsara Telugu Ugadi was grandly celebrated on Saturday morning at Srivari temple.

Vishesh samarpanam and Shuddi were observed to Sri Malayappa and his consorts Sridevi and Bhudevi besides Viswaksena in the morning after Suprabhata seva.

The Mula Virat and utsava idols were draped in new silks after processional puja around Vimana prakaram and Dwajastambham.

Later on pundits performed Panchanga shravanam and Asthanam at the Bangaru vakili in traditional manner.

TTD EO Sri Anil Kumar Singhal, JEO Sri B Lakshmi Kantham, DyEO Sri Harindranath, Peishkar Sri Ramesh Babu and other officials participated.

VEG CARVING STEALS THE SHOW

The carving of mythological characters in vegetables had stolen the show as the devotees were mused to see Dasavtara set near Dhwajasthambham. Similarly the Vamanavatara made of Navadhanyas was an added cynosure.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఉగాది ఆస్థానం

తిరుమల, 2019, ఏప్రిల్: తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌నివారం శ్రీ వికారినామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జెఈఓ శ్రీ బి.లక్ష్మీకాంతం, ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v