USER MANUAL IN TELUGU ON TTD WEB FOR THE EASE OF STUDENTS_ టిటిడి జూనియర్ కళాశాల‌ల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం
By TTD News On 16 May, 2019 At 04:24 PM | Categorized As Press Releases

Tirupati, 16 May 19: Eligible students are invited to apply online for admissions in TTD junior colleges for academic year of 2019-20 and for the ease of students manual in Telugu is also uploaded in TTD website apart from English.

Applications presently available in English only for admissions into Sri Padmavathi Mahila junior college and Sri Venkateswara junior College of TTD.

The applications can be downloaded from TTD website admission.tirumala.org up to May 25.However for the convenience of students, the user manuals, college prospectus etc. are also made available in both English and Telugu languages.

HOW TO APPLY:

When students open website for admission.tirumala.org they will have to choose from two boxes – Student manual English, Student manual Telugu and understand contents there in.

After expiry of schedule of deadline for admissions the students will get SMS of temporary allotments on merit and reservation quota. Students who get allotment should upload their certificates of eligibility for merit and reservation quota in online itself in the TTD website.

If the certificate is not valid or not correct the seat will be cancelled and their names get deleted from the system automatically. Hence students should upload their certificates etc. carefully well before the deadline as there is no room for alterations and corrections after May 25.

Students are requested to study the manuals and prospectus carefully before completing their online applications. While filling their applications the students could also resolve their doubts about courses, hostels and others through helpline phone numbers, which are available on the front page of admission.tirumala.org

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి జూనియర్ కళాశాల‌ల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

మే 16, తిరుపతి, 2019: టిటిడి తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌ల్లో 2019 – 20 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించ‌డ‌మైన‌ది. మే 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో admission.tirumala.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా ?

విద్యార్థులు admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే ” Student Manual in English” or “Student Manual in Telugu” రెండు బాక్స్ లు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ లపైన క్లిక్ చేశాక, అందులో దరఖాస్తు చేసే విధానాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. అనంతరం ఇంటర్మీడియట్ కోర్సుకు Junior Collegeను ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఇంగ్లీషు లేదా తెలుగు అనే బాక్స్ లు కనిపిస్తాయి. వాటిలో తమకు కావాల్సిన బాక్స్ లపై క్లిక్ చేయగానే టిటిడి ఆధ్వర్యంలోని రెండు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఉన్న వివిధ గ్రూప్ లలోని సీట్లు, వాటిలో ప్రవేశానికి కావాలసిన అర్హతలు, సీట్ల భర్తీ విధానం, మార్గదర్శకాలు తదితర వివరాలు కనిపిస్తాయి.

విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిశాక వారి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాలలో సీటును తాత్కాలికంగా ఆన్ లైన్ లో కేటాయించి, విద్యార్థుల‌కు ఎస్ఎమ్ఎస్ పంపుతారు. సీటు పొందిన సదరు విద్యార్థి ధృవీకరణ పత్రాలను వారి సమక్షంలోనే సిస్టమ్ లోకి అప్ లోడ్ చేస్తారు. అయితే విద్యార్థి ధృవీకరణ పత్రాలలోని వివరాలు సరిగాలేకున్నా, ఆన్ లైన్ లో సరిపోల్చకున్నా (టాలీకాకున్న) సీటు రద్దు కావడంతోపాటు సిస్టమ్ నుండి ఆటోమేటిక్ గా సదరు దరఖాస్తు రద్దు అవుతుంది. విద్యార్థులు గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. గడువు ముగిశాక సవరణలకు అవకాశం ఉండదు. అందువల్ల విద్యార్థులు స్టూడెంట్ యూజర్ మాన్యువల్‌ను, క‌ళాశాల‌ ప్రాస్పెక్ట‌స్‌ను పూర్తిగా చదివి పక్కన పెట్టుకుని ఆన్ లైన్ లో చాలా జాగ్రత్తగా దరఖాస్తు చేయాలని టిటిడి కోరుతోంది.

విద్యార్థులు దరఖాస్తు నింపు సమయంలో సాంకేతిక సందేహాలు, కోర్సులలోని వివిధ గ్రూప్ లు, వసతి గృహాలు, నిబంధనలు తదితర సందేహాలను హెల్ఫ్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేయగానే స్క్రీన్ పై హెల్ఫ్ లైన్ నంబర్లు అనే బాక్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే సంబంధిత అధ్యాపకుల ఫోన్ నంబర్లు ఉంటాయి. వీటి ద్వారా ఆయా అంశాలలోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

మే 25 వ‌ర‌కు దరఖాస్తుల్లో మార్పులు చేర్పులకు అవకాశం

టిటిడి నిర్వహిస్తున్న జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో స్వీకరించిన దరఖాస్తుల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు మే 25ను చివరి తేదీగా టిటిడి నిర్ణయించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసిన విద్యార్థుల వివరాలను పరిశీలించ‌గా చాలామంది కేవలం ఒక గ్రూపును మాత్రమే నమోదు చేశారు. పోటీ ఎక్కువగా ఉంటుంది కావున కేవలం ఒక గ్రూపుకు మాత్రమే దరఖాస్తు చేస్తే సదరు గ్రూపునకు ఉన్న డిమాండ్‌, విద్యార్థుల మార్కులను బట్టి సీటు రావచ్చు, రాకపోవచ్చు. విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ గ్రూపులకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినపుడు విద్యార్థులు పొరబాటున కానీ, తెలియక కానీ ఒక గ్రూపును మాత్రమే ఎంపిక చేసుకుని ఉంటే తిరిగి అడ్మిషన్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయి మరికొన్ని గ్రూపులను దరఖాస్తుకు జత చేయవచ్చు. మే 25 తరువాత ఇలాంటి మార్పులు చేసేందుకు వీలుండదు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v