ACHARYA RITWIK VARANAM AND ANKURARPANAM PERFORMED_ శ్రీ‌వ‌రాహ‌స్వామివారి ఆల‌యంలో రుత్విక్‌వరణంతో ”బాలాలయం” కార్యక్రమాలు ప్రారంభం
By TTD News On 22 Apr, 2019 At 04:23 PM | Categorized As Temple News

Tirumala, 22 Apr. 19: The prelude festival for mahasamprokshanam, Ankurarpanam was performed in the temple of Sri Bhu Varahaswamy temple in Tirumala on Monday evening.

This celestial fete was performed by bringing the sacred soil from Vasantha Mandapam and performing Vishwaksena Aradhana. Later in the night Ankurarpanam was performed by sowing Navadhanyas in different Palikas.

ACHARYA RITWIK VARANAM

Earlier during the day, Acharya Ritwik Varanam was performed where in the Acharya Purushas who are going to perform homams during these days will be assigned respective duties.

MAHA SAMPROKSHANAM ON APRIL 27

Tirumala Temple Chief Priest Sri Venugopala Deekshitulu said, the Yagashala activities will be performed from 23 to 26 and Mahasamprokshanam
on April 27 in the auspicious time between 11.07 am and 1.16pm.

EO Sri Anil Kumar Singhal, JEO Tirumala Sri KS Sreenivasa Raju, VGO Manohar, DyEO Sri Harindranath and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ‌వ‌రాహ‌స్వామివారి ఆల‌యంలో రుత్విక్‌వరణంతో ”బాలాలయం” కార్యక్రమాలు ప్రారంభం

ఏప్రిల్ 22, తిరుమ‌ల‌, 2019: తిరుమ‌ల‌లోని శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో సోమ‌వారం ఉదయం రుత్విక్‌ వరణం(ఆచార్య‌వ‌ర‌ణం)తో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమ‌ల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీ‌నివాస‌రాజు పాల్గొని రుత్వికులకు వస్త్రప్రదానం చేశారు. అంతకుముందు రుత్వికులకు స్థాన నిర్ణయం జరిగింది.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ సోమ‌వారం ఉద‌యం ఆచార్య‌వ‌ర‌ణం జ‌రిగింద‌ని, రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, వసంతమండపంలో పుణ్యాహ‌వ‌చ‌నం, మేదినిపూజ చేసి పుట్టమన్ను సేకరిస్తార‌ని, రాత్రి 9.30 నుండి 10.30 గంటల వరకు యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. ఏప్రిల్ 23న మంగ‌ళ‌వారం ఉద‌యం పుణ్యాహ‌వ‌చ‌నం, వాస్తుహోమం, అక‌ల్మ‌ష హోమాలు, ర‌క్షాబంధ‌నం చేప‌ట్టి యాగ‌శాల‌లోని హోమ‌గుండాల వ‌ద్ద రుత్వికులు హోమాలు ప్రారంభిస్తారని వివ‌రించారు. సాయంత్రం క‌ళాక‌ర్ష‌ణ జ‌రుగుతుంద‌ని, ఇందులో శ్రీ వ‌రాహ‌స్వామివారి మూల‌మూర్తి శ‌క్తిని కుంభంలోకి ఆవాహ‌న చేసి యాగ‌శాల‌లో ప్ర‌తిష్టించి ఆరాధ‌న‌లు చేప‌డ‌తార‌ని తెలియ‌జేశారు. ఆ త‌రువాత ఏప్రిల్ 25వ తేదీ వ‌ర‌కు గ‌ర్భాల‌యంలో జీర్ణోద్ధ‌ర‌ణ(మ‌ర‌మ్మ‌తులు), యాగ‌శాల కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి అష్ట‌బంధ‌నం స‌మ‌ర్పిస్తారని తెలిపారు. ఏప్రిల్ 26న మ‌ధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 6.00 గంట‌ల వ‌ర‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారికి మ‌హాశాంతి తిరుమంజ‌నం, పూర్ణాహుతి జ‌రుగుతాయ‌న్నారు. ఏప్రిల్ 27న ఉదయం 11.07 నుండి మ‌ధ్యాహ్నం 1.16 గంట‌ల వ‌ర‌కు మహాసంప్రోక్షణ జ‌రుగుతుందని, మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుండి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తార‌ని తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v