ASTABANDHANA SAMARPANAM HELD SVS TEMPLE_ శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా అష్ట‌బంధ‌నం స‌మ‌ర్ప‌ణ‌
By TTD News On 25 Apr, 2019 At 05:21 PM | Categorized As Temple News

Tirupati, 25 Apr. 19: The auspicious event of Astabandhana Samarpanam was held at Sri Varahaswamy temple in Tirumala on Thursday in a religious manner.

The holy Astabandhana paste preparation was held at Sri Anjaneya Swamy temple located Swamy Pushkarini and later the holy paste was applied to the sub-shrines of Sri Vishwaksenulavaru, Sri Ramanujacharyulu, Sri Anjaneya Swamy apart from Sri Bhu Varaha Swamy amidst the chanting of vedic hymns by priests.

The entire event took place under the supervision of Chief Priest Sri Venugopala Dikshitulu. TTD EO Sri Anil Kumar Singhal, JEO Tirumala Sri KS Sreenivasa Raju, temple DyEO Sri Harindranath and others also took part in this celestial fete.

On Friday, Mahashanti Purnahuti will be performed in the yagashala between 8pm and 10pm while on April 27 the celestial fete concludes with Maha Samprokshanam.

Twenty Ritwiks and 10 Veda pathashala students led by chief priest of Srivari temple Sri Venugopala Dikshitulu performed yagashala rituals on Wednesday between 8am and 12 noon and again from 8pm to 10pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా అష్ట‌బంధ‌నం స‌మ‌ర్ప‌ణ‌

ఏప్రిల్ 25, తిరుమ‌ల‌, 2019: తిరుమ‌ల‌లోని శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న అష్ట‌బంధ‌న బాలాల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా గురువారం శాస్త్రోక్తంగా అష్ట‌బంధ‌నాన్ని స‌మ‌ర్పించారు. ఉద‌యం, సాయంత్రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, ప్ర‌బంధ గోష్టి, వేద‌పారాయ‌ణం చేప‌ట్టారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు పాల్గొన్నారు.

ముందుగా పుష్క‌రిణి వ‌ద్ద‌గ‌ల శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద అష్ట‌బంధ‌న చూర్ణం త‌యారీ కార్యక్ర‌మం జ‌రిగింది. శంఖచూర్ణం, మధుజ (తేనెమైనం), లాక్షా(లక్క), గుగ్గులు(వృక్షపు బంక), కార్పాసం(ఎర్ర పత్తి), త్రిఫలం(ఎండిన ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ), రక్తశిలాచూర్ణము (గైరికము) త‌దిత‌ర ద్ర‌వ్యాల‌ను రోటిలో వేసి దంచారు. శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వ‌ర్యంలో ఈ కార్యక్ర‌మం జ‌రిగింది. శ్రీ వ‌రాహ‌స్వామివారి మూల‌మూర్తితోపాటు శ్రీ విష్వ‌క్సేనుల‌వారు, శ్రీ రామానుజాచార్యుల‌వారు, పుష్క‌రిణి వ‌ద్ద‌గ‌ల శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హాల‌కు అష్ట‌బంధ‌నాన్నిస‌మ‌ర్పించారు. విగ్రహం చుట్టూ కదలికలు లేకుండా ధృడంగా ఉండేందుకు పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో ఈ చూర్ణాన్ని స‌మ‌ర్పించారు.

అష్టబంధనం ద్ర‌వ్యాల్లోని శంఖచూర్ణంతో చంద్రుడిని, తేనెమైనంతో రోహిణీని, లక్కతో అగ్నిని, గుగ్గులుతో చండను, ఎర్ర పత్తితో వాయువును, త్రిఫల చూర్ణంతో హరిని , గైరికముతో స్కందుడిని, గేదె వెన్నతో యముడిని ఆరాధిస్తారు. ముందుగా ఈ ద్రవ్యాలను శుభ్రపరిచి ఆచార్యుల సమక్షంలో సంప్రదాయ శిల్పులు రోటిలో వేసి 30 నిమిషాలు బాగా దంచుతారు. బాగా దంచిన తరువాత అది పాకంగా తయార‌వుతుంది. ఈ పాకం చల్లబడిన తరువాత ముద్దగా చేసుకుంటారు. ఈ ముద్దను గంటకు ఒక్కసారి చొప్పున 8 మార్లు కావలసిన వెన్నను చేర్చుతూ దంచుతారు. ఈ విధంగా వచ్చిన పాకాన్ని ముద్దలుగా తయారుచేస్తారు.

ఏప్రిల్ 26న శుక్ర‌వారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారికి మ‌హాశాంతి పూర్ణాహుతి, తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాల‌లో భాగంగా శ‌య‌నాధివాసం చేప‌డ‌తారు.

ఏప్రిల్ 27న మహాసంప్రోక్షణ :

ఏప్రిల్ 27న ఉదయం 11.07 నుండి మ‌ధ్యాహ్నం 1.16 గంట‌ల వ‌ర‌కు మహాసంప్రోక్షణ జ‌రుగనుంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుండి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ వ‌రాహ‌స్వామివారు తిరు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v