VASANTHOTSAVAMS COMMENCES AT SKVST _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం

Srinivasa Mangapuram, 11 May 2020: The annual three day Vasanthotsavams commenced in Sri Kalyana Venkateswara Swamy temple on Monday.

Snapana Tirumanjanam was performed to the processional deities of Sri Kalyana Venkateswara Swamy, Sridevi and Bhudevi between 2pm and 4pm.

Due to ongoing Corona COVID 19 lockdown restrictions, the festival was performed in Ekantam.

DyEO Sri Ellappa, Superintendent Sri Ramanaiah and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం
మే 11, తిరుపతి, 2020: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ఎల్లప్ప, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.