VATAPATRASAI ENTHRALLS DEVOTEES_ వటపత్రశాయ అలంకారంలో శ్రీరామచంద్రమూర్తి తేజోవిలాసం
By TTD News On 15 Apr, 2019 At 12:18 PM | Categorized As Brahmotsavams

Vontimitta, 15 Apr. 19: Lord Sri Rama as “”Vatapatrasai” mused the devotees on the third day morning as a part of the ongoing annual brahmotsavams in Vontimitta, in YSR Kadapa district on Monday morning.

The devotees who converged to take a glimpse of Lord were enthralled by the unique guise.

Meanwhile, Vatapatrasai means Lord sleeping on a banyan tree leaf. We find the reference in Markendeya Maharshi Charitra. Markendeya meditates for six manvantras and Lord Indra tries hard to disturb his meditation by all means but fails. After seeing his devoted meditation, Lord Vishnu appears and asks for a boon. Markandya seeks the Lord that he wants to cherish His magic.

After a few days there was a hail storm and everything destroys. Markendeya notices a small baby boy floating on banyan leaf, sucking his foot toe by holding his leg with His little hands. Sage Markandeya realizes that the baby boy is none other than Lord Maha Vishnu and lauds Him as “Vatapatra sai”.

DyEO Sri Natesh Babu, AEO Sri Rama Raju other temple priests and a large number of devotees participated in the celestial event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వటపత్రశాయ అలంకారంలో శ్రీరామచంద్రమూర్తి తేజోవిలాసం

ఒంటిమిట్ట, 2019 ఏప్రిల్‌ 15: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమవారం ఉదయం వటపత్రశాయ అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు.

వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.30 గంటల వరకు సింహ వాహనంపై శ్రీకోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.

సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్‌బాబు, ఏఈవో శ్రీ రామరాజు, ఇతర అధికార ప్రముఖులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు :

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మూెత్సవాల్లో మూడ‌వ‌ రోజైన సోమ‌వారం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తిభావాన్ని పంచాయి. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీ‌మ‌తి జ్యోతి ‘ శ్రీ‌రామ వైభ‌వం’ అనే అంశంపై ధార్మికోపన్యాసం చేశారు.

సాయంత్రం 6.00 నుంచి 7.00 గంటల వరకు కడపకు చెందిన శ్రీ వాణి అర్జున్‌ బృదం భక్తి సంగీత కార్యక్రమం జరుగనుంది. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు శ్రీ సుధాకర్‌ భాగవతార్‌ హరికథా పారాయణం చేయనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v