VEENADHARI SHINES BRIGHT ON HAMSA _ హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి

Tiruchanoor, 24 Nov. 19: As the Goddess of wisdom and knowledge Saraswathi Devi,  the divine mother shined bright on Hamsa Vahanam on second day of brahmotsavams on Sunday evening.

Holding Veena in her hand and blessing the devotees, Goddess draped in a white silk sare with blue border and decked with dazzling jewels mused the devotees.

The cultural troupes in front of the vahanam added the glamour to the divine carrier procession.

HH Sri Sri Pedda Jeeyar Swamy, HH Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Sri Anil Kumar Singhal, Addl CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy, VGO Sri Prabhakar, Agama Advisor Sri Srinivasa Charyulu, Arjitham Inspector Sri Srinivasulu and others took part.

ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER, TIRUPATI

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి

తిరుపతి, 2019 న‌వంబ‌రు 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి సరస్వతి అలంకారంలో అమ్మవారు వీణ ధరించి భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

భారతీయ సంస్కృతిలో అనాదిగా మహావిజ్ఞాన సంపన్నులైన మహాత్ములను, యోగిపుంగవులను ”పరమహంస”లుగా పేర్కొనడం సంప్రదాయం. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే నీరు, పాలు వేరు చేయగలగడం. యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అట్టి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు శ్రీ అనంత, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్వో శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్లు శ్రీ గోపాల‌కృష్ణారెడ్డి, శ్రీ ఈశ్వరయ్య, ఏవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్‌రావు, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కోలా శ్రీ‌నివాసులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.