VEHICLE DONATED _ ఎస్వీబీసీకి రూ.1.20 కోట్ల విలువైన డి.ఎస్.ఎన్.జి వాహనం విరాళం

Tirumala, 21 Dec. 20: Delhi based Businessman and Philanthropist Sri Jain has donated Rs.1.20 crores worth DSNG vehicle to Sri Venkateswara Bhakti Channel on Monday.

After performing the puja to the vehicle adjacent to Vahana Mandapam at Tirumala, Sri Jain handed over the keys of the vehicle to Additional EO and the SVBC MD Sri AV Dharma Reddy.

CEO SVBC Sri Suresh Kumar, Temple DyEO Sri Harindranath, Peishkar Sri Jaganmohanacharyulu were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

ఎస్వీబీసీకి రూ.1.20 కోట్ల విలువైన డి.ఎస్.ఎన్.జి వాహనం విరాళం

తిరుమల, 2020 డిసెంబ‌రు 21: ఢిల్లీకి చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త శ్రీ జైన్‌ టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కు రూ.1.20 కోట్ల విలువైన డి.ఎస్.ఎన్.జి వాహనాన్ని సోమ‌వారం విరాళంగా అందించారు.

శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాత‌ శ్రీ జైన్ వాహనం తాళాలను టిటిడి అద‌న‌పు ఈవో మరియు ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈఓ శ్రీ జి.సురేష్ కుమార్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, పేష్కార్ శ్రీ జ‌గ‌న్మోహ‌నాచార్యులు త‌దితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.