VENGAMAMBA JAYANTHI AT TIRUMALA ON MAY 17_ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతికి ఏర్పాట్లు పూర్తి
By TTD News On 16 May, 2019 At 04:39 PM | Categorized As Press Releases

Tirumala, 16 May 19: Ardent devotee of Sri Venkateswara Swamy and Sri Lakshmi Narasimha Swamy, Matrusri Tarigonda Vengamamba 289th Jayanthi celebrations will be observed in Tirumala on Friday.

As a part of this fete, the processional deities of Sri Malayappa, Sridevi and Bhudevi will be brought to Narayanagiri Gardens and Unjal seva is performed after Sahasradeepalankara Seva.

Here vengamamba kritis will be rendered by project artistes. Earlier by 4.30pm floral tributes will be paid to the saint poetess at Vengamamba Brindavanam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతికి ఏర్పాట్లు పూర్తి

తిరుమల, 2019 మే 16: శ్రీవేంకటేశ్వరస్వామికి అపరభక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవం మే 17వ తేదీ శుక్ర‌వారంనాడు తిరుమలలో ఘనంగా జరుగనుంది.

శ్రీవారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు ప్రదర్శించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 1730వ సంవత్సరంలో జన్మించారు. శ్రీ రాఘవేంద్రస్వామి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి లాగా తన బృందావనంలోనే 1817లో సజీవ సమాధి చెందారు. తిరుమలలో అన్నదానాన్ని ప్రారంభించినందుకు గుర్తుగా వెంగమాంబ పేరు ముందు మాతృశ్రీ అనే పదం చేరింది. టిటిడి ప్రతి ఏడాదీ వెంగమాంబ జయంతిని క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో సాయంత్రం 4.30 గంటలకు పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కూడిన శ్రీమలయప్పస్వామివారు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6.00 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాల్లోని శ్రీ పద్మావతి పరిణయమండపానికి వేంచేపు చేస్తారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంట‌ల వ‌ర‌కు అక్కడ వెంగమాంబ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. అనంత‌రం చెన్నై టి.న‌గ‌ర్‌కు చెందిన శ్రీ విష్ణు మోహ‌న్ ఫౌండేష‌న్‌ చెందిన శ్రీ హ‌రిప్ర‌సాద్ శ్రీ స్వామీజి అనుగ్ర‌హ‌భాష‌ణ‌ము చేయ‌నున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v