VENGAMAMBA JAYANTHI ON MAY 16 AND 17_ మే 16, 17 తేదీలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 289వ జయంతి ఉత్సవాలు
By TTD News On 15 May, 2019 At 06:36 PM | Categorized As Press Releases

Tirupati, 15 May 19: The 289th Jayanthi celebrations of Matrusri Tarigonda Vengamamba
Will be observed in Tirupati, Tarigonda and Tallapaka on May 16 and 17 by TTD.

In Tirupati scholarly lectures on Vengamamba life and works will be organised in Annamacharya Kalamandiram and Harikatha and special pujas in Tarigonda, Pushpanjali and Unjal seva in Tirumala will be observed on May 16.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 16, 17 తేదీలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 289వ జయంతి ఉత్సవాలు

తిరుపతి, 2019 మే 15: భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 289వ జయంతి ఉత్సవాలకు టిటిడి ఏర్పాట్లను పూర్తి చేసింది. మే 16, 17 తేదిలలో తిరుపతిలోనూ మే 17వ తేది తిరుమలలో జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.

మే 16వ తేది తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉ.10 గం.టల నుండి 11.30 గం.ల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఎ. రాజమోహన్, శ్రీ ఎం. రవిచంద్ర బృందంచే గాత్రం, ఉ.11.30 నుండి మధ్యాహ్నం 1 గం. వరకు శ్రీమతి టి. లక్ష్మీరాజ్యం బృందంచే హరికథ, సాయంత్రం 6 గంటల నుండి 8 గం. వరకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే గాత్రం సంగీతం జరుగనుంది. మే 17వ తేది ఉదయం 9 నుండి 10 గం.ల వరకు తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి, అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30గం.ల తెలుగు సాహిత్యం – తరిగొండ వెంబగమాంబ స్థానం అనే అంశంపై సాహితీ సదస్సు జరుగనుంది. సాయంత్రం 6 గం.ల నుండి ధర్మవరంకు చెందిన శ్రీ డి.ఆర్.బాబు బాలాజి బృందంచే నృత్య కార్యక్రమం జరుగనుంది.

మే 16వ తేది తరిగొండలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో పుష్పాంజలి, గోష్ఠీగానం, హరికథ నిర్వహిస్తారు. మే 17వ తేది ఉ.9 గం.లకు శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణం, సాయంత్రం సంగీత సభ, హరికథ జరుగనుంది.

మే 17వ తేది తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో సాయంత్రం 4.30 గం.లకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనమునకు పుష్పాంజలి సమర్పిస్తారు. సా.5.30 గం.ల నుండి 6 గం.ల వరకు శ్రీవారు ఉభయనాంచారీ సమేతంగా తిరుమల మాడవీధుల ద్వారా నారాయణగిరి ఉద్యానవనముకు వేంచేపు చేస్తారు. సా.6 నుండి 7 గం.ల వరకు టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల బృందంచే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గోష్ఠీగానం, రా.7.గం.లకు శ్రీ హరిప్రసాద్ స్వామీజిచే అనుగ్రహ భాషణము జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v