VIKARI PANCHANGAM RELEASED_ శ్రీ వికారినామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ –
By TTD News On 16 Mar, 2019 At 08:19 PM | Categorized As General News

Tirumala, 16 Mar. 19: The Telugu Panchangam for Vikari Nama Samvatsaram which is going to commence from April 6 in the day of Ugadi was released by TTD EO Sri Anil Kumar Singhal.

Speaking on the occasion the EO said, the TTD almanac penned by Sri Tangirala Prasad Siddhanti was released during Teppotsavam today. He wished that the upcoming year will bestow prosperity on all.

HH Sri Pedda Jiyar, Sri Chinna Jiyar Swamijis of Tirumala, temple chief priest Sri Venugopala Deekshitulu, Dr Vedantam Vishnubhattacharya-Panchanga Parishkartha, Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri Gopinath Jatti and others were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ వికారినామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ

తిరుమల, 2019 మార్చి 16: టిటిడి రూపొందించిన శ్రీ వికారినామ సంవత్సర పంచాంగాన్ని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజుతో కలిసి ఆవిష్కరించారు. తిరుమలలో శ‌నివారం సాయంత్రం శ్రీ‌వారి తెప్పోత్సవాల సందర్భంగా ఈ పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

టిటిడి ధర్మప్రచారంలో భాగంగా ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాబోయే శ్రీ వికారినామ సంవత్సర ఉగాది పంచాంగాన్నిటిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్‌ సిద్ధాంతి రచించినట్లు తెలియ‌జేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v