VIRTUAL SEVA QUOTA RELEASED IN ONLINE _ శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల ఆన్‌లైన్ టికెట్ల కోటా విడుదల

Tirumala, 29 Jun. 21: TTD has released virtual Arjita Seva tickets in online for the month of July on Tuesday.

The devotees who booked the Arjita Seva tickets including Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam and Sahasra Deepalankara Seva shall have to witness the Seva in their houses.

Apart from Arjita sevas, the devotees have to book Rs. 300 tickets separately to avail darshan while Kalyanotsavam devotees need not have to pay for Rs. 300 tickets but have to book their darshan slot alone.

The devotees are requested to make note of this and book their arjita Seva virtual tickets in online.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల ఆన్‌లైన్ టికెట్ల కోటా విడుదల

 తిరుమల, 2021 జూన్ 29: జూలై నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి కల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకార‌ సేవల ఆన్‌లైన్ (వ‌ర్చువ‌ల్‌) టికెట్ల కోటాను మంగళవారం టిటిడి విడుదల చేసింది. ఈ సేవా టికెట్లు పొందిన భ‌క్తులు ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా త‌మ ఇళ్ల నుండే వ‌ర్చువ‌ల్ విధానంలో ఈ సేవ‌ల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ముంద‌స్తుగా ఈ సేవ‌ల‌ టికెట్ల‌ను బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది. కాగా, కల్యాణోత్సవం టికెట్లు పొందిన‌ గృహస్తుల‌కు(ఇద్దరికి) ఆ టికెట్‌పై ఉచితంగా ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. అయితే, క‌ల్యాణోత్స‌వం టికెట్‌ పొందిన భ‌క్తులు త‌మ‌కు సౌక‌ర్య‌వంత‌మైన తేదీనాడు రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.