VISHNU BILWA PATRARCHANA PUJA COMMENCES _ వ‌సంత మండ‌పంలో శ్రీ విష్ణు బిల్వాప‌త్రార్చ‌న పూజ ప్రారంభం

Tirumala, 10 Jan. 21: As part Dhanurmasa Vishnu Puja taken up TTD, the five day Bilwapatrarchana Vishnu Puja commenced in Tirumala on Sunday.

This religious event took place at Vasantha Mandapam between 6am and 6:30am and live telecasted on SVBC.

Speaking on the occasion, HDPP Secretary Acharya C Rajagopalan said, Bilwa (sacred fig) leaves are being revered as Maha Lakshmi and is a symbol of prosperity.

Usually, Bilwa leaves are used in Sivarchana while Tulasi leaves in Vishnu Puja. But it is only in this sacred month of Dhanurmasa, Sri Maha Vishnu is being offered special puja with Bilwa leaves as per holy Hindu scriptures.

Earlier, the replicas of Sri Srinivasa, Sridevi and Bhudevi were brought to Vasanta Mandapam and offered Dhooparchanam, Bilwarchanam and Nivedanam. A replica of Ananta Padmanabha Swamy was also placed in the background.

After the Namarchana with Bilwa leaves, Harati was offered. This ritual will conclude in January 14 at Tirumala on the last day of Dhanurmasam.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

వ‌సంత మండ‌పంలో శ్రీ విష్ణు బిల్వాప‌త్రార్చ‌న పూజ ప్రారంభం

తిరుమల‌, 2021 జ‌న‌వ‌రి 10: ప‌విత్ర‌మైన ధ‌నుర్మాసాన్ని పుర‌స్క‌రించుకొని తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో ఆదివారం ఉద‌యం శ్రీ విష్ణు బిల్వాప‌త్రార్చ‌న పూజ నిర్వ‌హించారు. ఉద‌యం 6 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది. జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు ప్ర‌తి రోజు ఉద‌యం ఈ పూజ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.

ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ శ్రీ‌నివాసుడు, న‌మూనా అనంత ప‌ద్మ‌నాభ స్వామివారి విగ్ర‌హ‌న్ని  వ‌సంత మండ‌పంలో వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్  కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌ మాట్లాడుతూ లోక క్షేమం కొర‌కు ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో, ఆయురారోగ్యాల‌తో, సంతోషంగా ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్ధిస్తూ టిటిడి ఈ పూజ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. శ్రీ మ‌హాల‌క్ష్మీ అమ్మ‌వారు బిల్వాప‌త్రంలో కొలువై ఉంటార‌న్నారు. ల‌క్ష్మీ క‌ర‌ములైన బిల్వాప‌త్రాల‌తో శ్రీ‌వారికి అర్చ‌న నిర్వ‌హిస్తే మాన‌వాళికి శుభం చేకురుతుంద‌ని వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.