CHAKRASNANAM MARKS GRAND FINALE OF VONTIMITTA BTU_ వైభవంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం
By TTD News On 21 Apr, 2019 At 05:07 PM | Categorized As Brahmotsavams, Temple News

Vontimitta,April 21,2019: Scores Of devotees took part in the holy dip in the Pushkarani of Sri Kodandaramaswami temple at Vontimitta in Kadapa district as a part of chakra snanam, signalling the grand finale of the nine day Brahmotsavams.

After morning rituals,the utsava idols of Sita, Rama and Lakshmana were brought to the Pushkarani along with Sudarshana Chakrathalvar where they were offered special abhisekam before the sacred event of Chakra snanam.

The holy disc was immersed in temple tank at the auspicious hour marking the completion of the mega religious event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

ఒంటిమిట్ట, 2019 ఏప్రిల్ 21: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన ఆదివారం ఉదయం ఆల‌య ప్రాంగ‌ణంలో నూత‌నంగా నిర్మించిన పుష్క‌రిణిలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్‌ పల్లకిలో ఊరేగింపుగా పుష్క‌రిణి వ‌ద్ద‌కు వేంచేశారు.

అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంత‌రం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

కాగా రాత్రి 7.00 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ న‌టేష్ బాబు, ఏఈవో శ్రీ రామరాజు, ఇతర అధికారులు, విశేష‌ భక్తులు పాల్గొన్నారు.

పుష్పయాగం

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమ‌వారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v