VONTIMITTA SRI SEETARAMA KALYANAM A STATE FESTIVAL- JEO LAKSHMIKANTHAM_ శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో
By TTD News On 17 Apr, 2019 At 10:22 PM | Categorized As General News

Vontimitta, 17 Apr. 19: The TTD Joint executive officer for Tirupati Sri B Lakshmi Kantham asserted that the state government has accorded state festival status to celestial event of Sri Sita Rama Kalyanam at Vontimitta.

After an inspection of the arrangements on Wednesday evening at Vontimitta, the JEO said that the TTD has extended arrangements for the benefit of devotees attending the celestial event of Sri Sita Rama Kalyanam.

Earlier the JEO reviewed and inspected the arrangements fir Sitarama Kalyanam and also annual Brahmotsavams and interacted with devotees who expressed immense satisfaction over the arrangements.

SE-1Sri Ramesh Reddy, EE Sri Jaganmohan Reddy and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో

ఒంటిమిట్ట, 2019 ఏప్రిల్ 17: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 18వ తేదీ గురువారం జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం బుధ‌వారం అధికారుల‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఒంటిమిట్ట రాములవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణం ఎంతో ముఖ్యమైనదని, దీనిని రాష్ట్రస్థాయి వేడుకగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సంతృప్తికరంగా కల్యాణాన్ని తిలకించేలా గ్యాల‌రీలు ఏర్పాటు చేశామ‌న్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించామని, భద్రతా ఏర్పాట్లకు తగ్గట్టు ఇంజినీరింగ్‌ పనులు చేపడుతున్నామని తెలిపారు. భ‌క్తుల‌కు ఆధ్యాత్మిక, అహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం క‌ల్పించేందుకు హ‌రిత‌శోభ‌ను చేకూర్చ‌నున్న‌ట్లు తెలిపారు. భక్తులందరూ కల్యాణానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

అంత‌కుముందు జెఈవో అధికారుల‌తో క‌లిసి క‌ల్యాణ వేదిక వ‌ద్ద జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఆల‌యంలో చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్బంగా భ‌క్తులు టిటిడి అందిస్తున్నసౌక‌ర్యాల‌పై సంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఇ -1 శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆల‌య ఏఈవో శ్రీ రామరాజు, ఇఇ శ్రీజ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, డిఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v