WALL POSTERS OF 516th ANNAMACHARYA VARDHANTHI RELEASED_ అన్నమయ్య 516వ వర్ధంతి ఉత్సవాల గోడపత్రికలు ఆవిష్క‌ర‌ణ‌
By TTD News On 23 Mar, 2019 At 04:40 PM | Categorized As General News

Tirupati, 23 Mar. 19: TTD Joint Executive Officer Sri B Lakshmi Kantham released wall posters of the 516th Anniversary Celebrations of Saint Poet Tallapaka Annamacharya at the Sri Kodandarama Swamy Temple on Saturday morning.

He said TTD plans to grandly celebrate the even from April 1 to April 4 at Tirumala, Tirupati and Tallapaka the celebrations will kick off with the metlotsavam at the Padala mandapam in Alipiri Tirupati on March 31 morning wherein hundreds of devotees will perform TTD Annamacharya Project to Tirumala chanting Bhajans, Annamacharya sankeertans and Kolatas. On April 1 Annamacharya Vardhanthi time utsavam will be performed at Narayanagiri gardens in the evening.

The JEO said that April 1-4 the bhajans and Bhakti sangeet programs will be conducted at the Dhyana mandir, Near the 108 feet Annamacharya statue at Tallapaka, Mahati auditorium and Annamacharya kala mandir at Tirupati.Prominent singers, dancers and Harika that’s bhagavathars will participate .TTD also plans to conduct a 3 day literary convention at the Annamacharya kala mandir from April 1st.

Director of Annamacharya project Acharya B Viswanathan, HDPP Secretary Sri Ramana Prasad, DyEO Sri EC Sridhar, VSO Sri Ashok Kumar Goud and other officials participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అన్నమయ్య 516వ వర్ధంతి ఉత్సవాల గోడపత్రికలు ఆవిష్క‌ర‌ణ‌

తిరుపతి, 2019, మార్చి 23: పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 516వ వర్ధంతి ఉత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం శ‌నివారం తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామాల‌యంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు తిరుమల, తిరుపతి, తాళ్లపాకలో అన్నమయ్య వర్ధంతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.

కాగా, మార్చి 31వ తేదీ ఉదయం 6.00 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం జరుగనుంది. ఈ సంద‌ర్భంగా భక్తులు భజనలు, కోలాటాలతో అన్నమయ్య కీర్తనలను ఆలపిస్తూ తిరుమలకు పాదయాత్రగా వెళ్తారు. ఏప్రిల్ 1న తిరుమలలో అన్నమాచార్య వర్ధంతి ఉత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా సాయంత్రం 6.00 గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో స‌ప్త‌గిరి సంకీర్త‌నా గోష్ఠిగానం నిర్వహిస్తారు.

అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో సుప్రసిద్ధ సంగీత, నృత్య కళాకారులు, పండితులు పాల్గొననున్నారు. అన్నమాచార్య కళామందిరంలో ఏప్రిల్ 2, 3వ తేదీల్లో సాహితీ స‌ద‌స్సు జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య బి.విశ్వ‌నాథం, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి డా..ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, డెప్యూటీ ఈవో శ్రీ ఇసి.శ్రీ‌ధ‌ర్‌, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌ ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v