WOMEN EMPLOYEES IN TTD EXCEL WITH THEIR METTLE-TTD EO_ మ‌హిళా స‌మాన‌త్వాన్ని పాటించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌
By TTD News On 8 Mar, 2019 At 06:37 PM | Categorized As General News

Tirupati, 8 Mar. 19: The women employees with their working skills and patience thriving well in key posts in TTD, complimented TTD EO Sri Anil Kumar Singhal.

The EO graced the International Women’s Day observed by TTD along with Tirupati JEO Sri B Lakshmikantham, held at Mahati Auditorium on Friday in a big way.

Speaking on this occasion he said, this year is being observed as no gender discrimination and equal opportunities to men and women. “In TTD the women work force excel well in different posts. Thr temples of Tiruchanoor, Sri Govindaraja Swamy are being headed by women Deputy EOs only. But you still need to grab the opportunities which come in your way. For that you need to invoke the capacities present within you”, he expressed.

He said his mother studied only primary classes but she taught all of us the ethical values which helped us a lot in our personal and professional life which we are enjoying today. That is the power of a mother”, he maintained.

The EO said, the grievances of women employees are regularly being redressed now in the redressal cell, competitions were held for women, the new sports complex which we are contemplating will boost your energies”, he added. He complimented the way the programme is conducted under the aegis of Welfare Department of TTD.

Earlier Tirupati JEO Sri B Lakshmikantham in his address said, the Astadasa Shaktipeethams signify the importance and prominence given to women in India since Vedic age. Where women are worshipped and respected, that area will proper. “If a woman is educated she can do wonders. We are now aiming at skill development training program in TTD institutions”, he said.

Among the speakers Dr DM Premavathi, retired head of department for Telugu in SPW Degree and PG college said, the women have to build up the right path for their life. The foundation should be strong so that you can face any challenge which you come across your life. In my 77 years, three fourth of my journey went away and still going strong with SPW college. The college is undoubtedly a boon to lakhs of girls since it’s inception in 1952. Thanks to the efforts of then Executive Officer of TTD Dr C Anna Rao who envisaged the future of women in this great institution. I thank EO Singhal and his deputies for taking forward the legacy with time to improvements to better girl education”, she added.

Smt P Sumathi,ASI SHE team lead by Tirupati Urban police informed the women and girls that there are 3 SHE teams in Tirupati and one each in Renigunta and Sri Kala Hasti.

“PADMA” AWARDS PRESENTED

Later for the first time, Padmavathi awards were presented to four women employees in TTD on women’s day to those who excelled in their departments while dia charging their duties.

CULTURAL PROGRAMS STEAL THE SHOW

The day filled patriotic dance, kolatam by girls, fancy dress and Deepa Pradarshana by women employees of TTD has stolen the show.

Later the women employees who are going to retire this year in various cadres were felicitated. This was followed by prize distribution to winners in Singing, Essay Writing, Sports and Games conducted women employees on this occasion.

Tirupati MLA Smt Suguna, Veena Expert from Madurai Dr. S Mallika, National Athlete Kum. Duteechand, DyEOs Smt Varalakshmi, Smt Jhansi Rani, Smt Kasturi, Smt Nagarathna and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మ‌హిళా స‌మాన‌త్వాన్ని పాటించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన ఉద్యోగుల‌కు శ్రీ ప‌ద్మావ‌తి అవార్డులు

తిరుపతి, 2019 మార్చి 08: పురుషుల‌తో పాటు స‌మాన అవ‌కాశాలను క‌ల్పించ‌డం ద్వారా మ‌హిళా స‌మాన‌త్వాన్ని పాటించాల‌ని, సనాతన ధర్మం ప్ర‌కారం మహిళల‌ను గౌర‌వించాల‌ని టిటిడి కార్య‌నిర్వ‌హ‌ణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఉద్ఘాటించారు. టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్ర‌వారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో ప్రసంగిస్తూ విధి నిర్వ‌హ‌ణ‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన మ‌హిళా ఉద్యోగుల‌కు ఈ ఏడాది నుండి మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి పేరిట అవార్డులు ప్ర‌దానం చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. హిందూ సంప్ర‌దాయంలో మ‌హిళా దేవ‌తామూర్తులైన శ్రీ స‌ర‌స్వ‌తిదేవి విద్య‌ను, శ్రీ ల‌క్ష్మీదేవి సంప‌దను, శ్రీ దుర్గాదేవి శ‌క్తిని ప్ర‌సాదిస్తార‌ని, మాన‌వుని మ‌నుగ‌డకు ఈ మూడు అంశాలు కీల‌క‌మ‌ని తెలియజేశారు. కుటుంబంలో త‌ల్లి పాత్ర చాలా ముఖ్య‌మ‌ని, పిల్ల‌ల‌కు చిన్న వ‌య‌సు నుండే ధార్మిక చింత‌న‌, భ‌క్తిభావం నేర్పాల‌ని కోరారు. మహిళలకు ప్రాధాన్య‌త ఇస్తేనే ఏదేశ‌మైనా అభివృద్ధి సాధించ‌గ‌లుగుతుంద‌ని తెలిపారు. మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం, సమాజం అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. మహిళలకు టిటిడిలో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మ‌హిళా ఉద్యోగుల‌తో త‌ర‌చూ స‌మావేశాలు నిర్వ‌హించి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నామ‌ని వివ‌రించారు. తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం త‌దిత‌ర కీల‌క స్థానాల్లో మ‌హిళా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. మ‌హిళా ఉద్యోగుల‌కు ఓర్పు ఎక్కువ‌గా ఉంటుంద‌ని, ఈ కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల క్యూలైన్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు వారిని నియ‌మిస్తున్నామ‌ని చెప్పారు. నూత‌నంగా నిర్మిస్తున్న క్రీడా స‌ముదాయంలో మ‌హిళా ఉద్యోగుల‌కు ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పిస్తామ‌న్నారు. మ‌హిళ‌లు భ‌యాన్ని ప‌క్క‌న‌పెట్టి దేన్న‌యినా సాధించ‌గ‌ల‌మ‌నే ధీమాతో ముందుకు సాగాల‌ని ఈవో ఆకాంక్షించారు.

టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన మహిళలు సమానత్వం, సాధికారత సాధించేందుకు అవకాశాలు మెరుగుపరచాలన్నారు. మ‌హిళా సాధికార‌త కోసం ఐక్య‌రాజ్య స‌మితి 1975వ సంవ‌త్స‌రం నుండి ప్ర‌తి ఏడాదీ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తోంద‌ని తెలిపారు. ఎక్క‌డైతే మ‌హిళ‌లకు గౌర‌వం ద‌క్కుతుందో అక్క‌డ‌ సుఖశాంతులు ఉంటాయ‌న్నారు. భార‌త‌దేశంలో మ‌హిళ పూజ‌నీయురాల‌ని, అత్యంత మ‌హిమాన్విత‌మైన 18 శ‌క్తిపీఠాలు ఇక్క‌డే ఉన్నాయ‌ని వివ‌రించారు. మ‌హిళ‌ల‌కు విద్య ఎంతో ముఖ్య‌మ‌ని, టిటిడి విద్యాసంస్థ‌ల్లోని విద్యార్థినులకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇవ్వ‌డం ద్వారా త్వ‌ర‌గా ఉపాధి పొందే అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని తెలియ‌జేశారు.

శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పిజి క‌ళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిప‌తి డా.. డిఎం.ప్రేమావ‌తి కీల‌కోప‌న్యాసం చేస్తూ మ‌హిళా దినోత్స‌వ నేప‌థ్యాన్ని వివ‌రించారు. ఎవ‌రి జీవితానికి వారే క‌ర్త‌, క‌ర్మ, క్రియ‌ల‌ని, ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని మ‌హిళ‌లు ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌కుండా తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాల‌ని సూచించారు. 1952వ సంవ‌త్స‌రంలో అప్ప‌టి టిటిడి ఈవో శ్రీ సి.అన్నారావు శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ క‌ళాశాల‌ను ప్రారంభించార‌ని, అప్ప‌టినుండి ఎంతో మంది విద్యార్థినులు ఇక్క‌డ విద్య‌ను అభ్య‌సించి వివిధ రంగాల్లో ఉన్న‌త‌స్థానాల్లో ఉన్నార‌ని తెలిపారు. ఉక్కుమ‌హిళగా పేరొందిన మాజీ ప్ర‌ధాని శ్రీ‌మ‌తి ఇందిరాగాంధీ, భార‌త కోకిల శ్రీ‌మ‌తి స‌రోజిని నాయుడు లాంటి వారిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు. అనంత‌రం మ‌హిళా స‌మాన‌త్వం, స్వేచ్ఛ కోసం పాటుప‌డిన శ్రీ చ‌లం, శ్రీ కందుకూరి వీరేశ‌లింగం, శ్రీ‌మ‌తి మ‌హాశ్వేతాదేవి, శ్రీ‌మ‌తి సావిత్రిభాయి పూలే, శ్రీ‌మ‌తి ఓల్గా త‌దిత‌రుల గురించి వివ‌రించారు.

తిరుప‌తికి చెందిన షీ టీమ్ ఏఎస్ఐ శ్రీ‌మ‌తి పి.సుమ‌తి కీల‌కోప‌న్యాసం చేస్తూ కుటుంబం నుండే మ‌హిళా వివ‌క్ష‌ను అరిక‌ట్టాల‌న్నారు. మ‌హిళ‌లు ధైర్యంగా ముందుకొచ్చి త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు. తిరుప‌తిలో 3, రేణిగుంట‌లో 1, శ్రీ‌కాళ‌హ‌స్తిలో 1 షీ టీమ్‌లున్నాయ‌ని, మ‌హిళ‌లు నేరుగా కానీ, ఫోన్ ద్వారా కానీ ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని తెలియ‌జేశారు.

ఆ త‌రువాత మ‌ధురైలోని రాణి లేడి మేయ‌మ్మై ఆచ్చి త‌మిళ సంగీత క‌ళాశాల ప్రిన్సిపాల్ డా..ఎస్‌.మ‌ల్లిక‌, టిటిడి మ‌హిళా ఉద్యోగి శ్రీ‌మ‌తి ఇందిర, టిటిడి ఎంప్లాయిస్‌ బ్యాంక్ మాజీ డైరెక్టర్‌ శ్రీమతి కల్పన ప్ర‌సంగించారు. టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి ఆర్‌.స్నేహ‌ల‌త వందన సమర్పణ చేశారు. టిటిడి సహాయ ప్రజాసంబంధాల అధికారిణి కుమారి పి.నీలిమ, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| కృష్ణవేణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

అతిథులకు సన్మానం :

ఈ సందర్భంగా ముఖ్య వక్తలుగా విచ్చేసిన శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పిజి క‌ళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిప‌తి డా.. డిఎం.ప్రేమావ‌తి, తిరుప‌తికి చెందిన ఏఎస్ఐ శ్రీ‌మ‌తి పి.సుమ‌తి, ప్ర‌త్యేక ఆహ్వానితులైన మ‌ధురైలోని రాణి లేడి మేయ‌మ్మై ఆచ్చి త‌మిళ సంగీత క‌ళాశాల ప్రిన్సిపాల్ డా..ఎస్‌.మ‌ల్లిక‌, ఒడిశాలోని జాజ్‌పూర్‌కు చెందిన ఒలింపిక్ అథ్లెట్ కుమారి ద్యుతి చంద్‌ను జ్ఞాపిక, శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా, ఎస్వీ బ‌దిర క‌ళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీమ‌తి జి.ల‌క్ష్మీదేవి, ఎస్వీ హైస్కూల్ రిటైర్డ్ ప్ర‌ధానోపాధ్యాయురాలు శ్రీ‌మ‌తి క‌మ‌ల‌మ్మ‌, టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి గౌత‌మి, సహాయ ప్రజాసంబంధాల అధికారిణి కుమారి పి.నీలిమ, అన్న‌మాచార్య ప్రాజెక్టు ఏఈవో శ్రీ‌మ‌తి పూర్ణ‌వ‌ళ్లిని ఘ‌నంగా స‌న్మానించారు.

మ‌హిళా ఉద్యోగుల‌కు శ్రీ ప‌ద్మావ‌తి అవార్డులు

విధి నిర్వ‌హ‌ణ‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన మ‌హిళా ఉద్యోగుల‌కు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి పేరిట అవార్డులు ప్ర‌దానం చేశారు. వీరిలో శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పిజి క‌ళాశాల గ‌ణితం విభాగాధిప‌తి
డా.. ఎ.విద్యుల్ల‌త‌, టిటిడి డెప్యూటీ ఈఈ శ్రీ‌మ‌తి పి.విశాలాక్షి, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి కెఎ.ల‌క్ష్మీప్ర‌స‌న్న‌, స్వీప‌ర్ శ్రీ‌మ‌తి సుగుణ ఉన్నారు. వీరికి 5 గ్రాముల వెండి డాల‌ర్‌తోపాటు శాలువ‌, జ్ఞాపిక‌, శ్రీ‌వారి ప్ర‌సాదం అందించారు.

ఆ తరువాత 2019 మార్చి నుండి 2020 ఫిబ్ర‌వ‌రి వరకు పదవీ విరమణ పొందనున్న 57 మంది మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా, ఈ సంద‌ర్భంగా మ‌హిళా ఉద్యోగుల జాన‌ప‌ద నృత్యం, ఫ్యాన్సీడ్రెస్ ప్ర‌ద‌ర్శ‌న‌, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పిజి క‌ళాశాల విద్యార్థుల కోలాటం ఆక‌ట్టుకున్నాయి.

గాత్ర సంగీతం, వ్యాస‌ర‌చ‌న, క్రీడాపోటీల విజేత‌ల‌కు బ‌హుమ‌తులు

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా గాత్ర సంగీతం, వ్యాస‌ర‌చ‌న, క్రీడాపోటీల విజేత‌ల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు. గాత్ర సంగీత పోటీల్లో టిటిడి ఆఫీస్ స‌బార్డినేట్ శ్రీ‌మ‌తి బి.అమృత‌వ‌ళ్లి ప్ర‌థ‌మ‌, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ ద్వితీయ‌, ఎఎవో శ్రీ‌మ‌తి పి.గాయ‌త్రి దేవి తృతీయ బ‌హుమ‌తులు సాధించారు. వ్యాస‌ర‌చ‌న పోటీల్లో ప్రొఫెస‌ర్ సిహెచ్‌.శ్రీ‌దుర్గ ప్ర‌థ‌మ‌, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ ద్వితీయ‌, ఎఇఇ శ్రీ‌మ‌తి టి.సుప్ర‌జ తృతీయ బ‌హుమ‌తులు కైవ‌సం చేసుకున్నారు. ఎఎవో శ్రీ‌మ‌తి వి.భానుప్రియ క‌న్సొలేష‌న్ బ‌హుమ‌తి అందుకున్నారు. ఆ త‌రువాత విభాగాల వారీగా ట‌గ్ ఆఫ్ వార్‌, బాల్ బ్యాడ్మింట‌న్‌, డాడ్జిబాల్‌, పాసింగ్ ద ల‌గేజ్‌, త్రోబాల్ క్రీడ‌ల్లో గెలుపొందిన‌వారికి, ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన వారికి బ‌హుమ‌తులు అంద‌జేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, శ్రీ‌మ‌తి క‌స్తూరి, శ్రీ‌మ‌తి పార్వ‌తి, శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పిజి క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.. మ‌హ‌దేవ‌మ్మ‌ ఇతర మహిళా ఆధికారులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v