GRAND CELERBATION OF SRI SITA RAMA KALYANAM _ అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
- PRESENTATION OF GOLDEN GAJA LAKSHMI PATHAKAM
- SILVER LAMP PILLAR GIFTED
Tirupati, March 28, 2026: The sacred Sri Sitaramula Kalyanam was celebrated with grandeur on Saturday night at Sri Kodandarama Swamy Temple, Tirupati. TTD Executive Officer Sri M. Ravichandra participated in the ceremony.
The priests first performed Punyahavachanam, Sadyah Ankurarpanam, Rakshabandhanam, and Visesha Aradhana. This was followed by Rakshabandhanam, Agni Pratishtha, Madhuparkam, Kanyadanam, Mahasankalpam, Mangalyapuja, Mangalyadharana, Ukta Homams, Poornahuti, Nivedana, Akshatarohanam, Mutyala Talambralu Samarpana, Visesha Nivedana, Malamarpidi, Harati, Chaturveda Parayanam, and Vedic blessings to the Yajamani. After the rituals, the divine couple’s procession was held in the temple premises.
Presentation of Ornaments from Tirumala Temple
On this occasion, Sri Venkateswara Temple, Tirumala presented ornaments worth ₹62.44 lakhs — including a golden Gajalakshmi medallion and two silver lamp pillars.
These were brought by Tirumala officials — Peskar Ramakrishna and Bokkasa In-charge Sri Gururaj Swamy — and handed over to the temple’s Deputy EO Smt. Nagaratna.
Temple Inspector Sri Suresh and a large number of devotees participated in the event.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
• బంగారు గజ లక్ష్మీ పతకం,
వెండి దీప స్తంభాలు బహుకరణ
తిరుపతి, 2026 మార్చి 28: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణంలో టీటీడీ ఈవో శ్రీ ఎం రవిచంద్ర పాల్గొన్నారు.
ముందుగా అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల తలంబ్రాల సమర్పణ, విశేష నివేదన, మాలమార్పిడి, అక్షతారోహణ, హారతి, చతుర్వేద పారాయణం, యజమానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు.
శ్రీవారి ఆలయం నుండి బంగారు ఆభరణాలు బహుకరణ :
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఒక బంగారు గజ లక్ష్మీ పతకం, రెండు వెండి దీప స్తంభాలు రూ. 62.44 లక్షలు విలువ చేసే ఆభరణాలు బహుకరించారు.
తిరుమల నుండి పెష్కార్ రామకృష్ణ, బొక్కసం ఇంఛార్జి శ్రీ గురురాజ స్వామి తీసుకువచ్చి ఆలయ డిప్యూటీఈవో శ్రీమతి నాగరత్నకు అందించారు.
ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

















