TTD COMPLETES ARRANGEMENTS FOR INTERNATIONAL YOGA DAY _ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి – టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం

Tirupati, 20 June 2025: TTD JEO Sri V. Veerabrahmam said that the Tirumala Tirupati Devasthanams has completed all the arrangements for the International Yoga Day, scheduled to be held globally on June 21. 

The event will take place at 6.30 AM on Saturday at the Parade Grounds located within the TTD Administrative Building premises in Tirupati.

Under the supervision of senior TTD officials, special arrangements have been made to accommodate around 1,500 participants practicing yoga. 

TTD employees, staff, and students from TTD educational institutions are expected to participate in the event.

Sri Veerabrahmam instructed officials to ensure the provision of breakfast and drinking water to all participants at the venue.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి – టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం

తిరుపతి, 2025, జూన్ 20: ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీన జరుగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి టిటిడి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టిటిడి జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం వెల్లడించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని పెరేడ్ గ్రౌండ్ లో శనివారం ఉదయం 6.30 గం.లకు యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. టిటిడి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దాదాపు 1500 మంది వరకు యోగాసనాలు చేసేలా ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు. టిటిడి ఉద్యోగులు, సిబ్బంది, టిటిడి కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు హాజరుకానున్నారు. పేరెడ్ గ్రౌండ్ కు యోగాసనాలు చేసేందుకు వచ్చిన వారికి అల్పాహారం, త్రాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.