TTD’s DEVOTEE FEEDBACK FOR BETTERMENT OF PILGRIM SERVICES _ అందిస్తున్నవివిధసేవలపైభక్తులనుండిటీటీడీవిస్తృతఅభిప్రాయసేకరణ

Tirumala, 29 June 2025: As a part of its ongoing efforts to improve the services being provided to the multitude of visiting pilgrims, TTD has introduced Feedback mechanism quite some time ago to collect valuable opinions from the pilgrims.

Feedback is being gathered through various methods including IVRS, WhatsApp, e-Surveys, and manual surveys conducted by Srivari Sevaks.

IVRS Feedback Survey

Through this electronic method, devotees can express their opinions on 16 aspects of their Tirumala pilgrimage experience, Annaprasadam, Kalyanakatta, Srivari Darshan, accommodation, queue line management, and luggage counters, free bus facility and many more.

WhatsApp Feedback System

QR codes have been placed at various locations in Tirumala and Tirupati. 

Devotees can scan these codes with their mobile phones to open the TTD feedback page on WhatsApp (number: 9399399399).

Here, devotees can enter their name and select the relevant department (such as Annaprasadam, Health (sanitation), Kalyanakatta, laddu prasadam, luggage, darshan experience, queue lines, rooms, etc. to provide their feedback.

Manual and mobile app Feedback through Srivari Sevaks

In Tirumala Srivari Sevaks directly collect the feedback from pilgrims regarding facilities using a mobile application designed by TTD IT wing that contains a structured questionnaire. Some time they do manual feedback collection also.

Upcoming Digital Feedback Platforms

Soon, TTD will launch an application on its mobile app and booking portal to collect suggestions and feedback from devotees.

By collecting direct experiences through these surveys, TTD aims to respect devotees’ opinions and further enhance its service standards.

Devotees are requested to actively share their feedback and contribute towards the improvement of the services being offered by TTD.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అందిస్తున్న వివిధ సేవలపై భక్తుల నుండి టీటీడీ విస్తృత అభిప్రాయ సేకరణ

తిరుమల, 2025 జూన్ 29: భక్తులకు అందిస్తున్న వివిధ సేవలను ఎప్పటికప్పుడు మరింత మెరుగుపరచడంలో భాగంగా గత కొంత కాలంగా టీటీడీ భక్తుల నుండి విలువైన అభిప్రాయాల్ని వివిధ రకాల ఫీడ్‌బ్యాక్ సర్వేల ద్వారా సేకరించడం ప్రారంభించింది.

ఐవీఆర్ఎస్, వాట్సాప్ల ద్వారా e-Survey, శ్రీవారి సేవకుల ద్వారా మాన్యూవల్ సౌర్వే లను ప్రారంభించి టీటీడీ భక్తుల నుండి అభిప్రాయాలు తీసుకుంటోంది.

ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ సర్వే

ఈ ఎలక్ట్రానిక్ సర్వే విధానo ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్న ప్రసాదం, కళ్యాణ కట్ట, శ్రీవారి ఆలయం, వసతి, క్యూ లైన్ల నిర్వహణ మరియు లగేజ్ కౌంటర్ల పై మొత్తం 16 ప్రశ్నలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు.

వాట్సాప్ ఫీడ్ బ్యాక్ విధానం

తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే (వాట్సాప్‌ నెం: 9399399399) టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది.

ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి)ను ఎంచుకోవాలి.

శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ

తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతోంది. 

ఈ విధానంలో సేవకులు టీటీడీ రూపొందించిన ప్రశ్నావళితో కూడిన అప్లికేషన్ ను తమ Mobile డౌన్లోడ్ చేసుకుని  భక్తుల నుండి అభిప్రాయాలు సేకరిస్తారు.    

త్వరలోనే టీటీడీ మొబైల్ యాప్ మరియు టిటిడి బుకింగ్ పోర్టల్ నుండి భక్తులు యొక్క విలువైన సలహాలు సూచనలు తీసుకొనడానికి అప్లికేషన్ రూపొందించబడుతున్నది. 

భక్తుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, సేవలను మరింత మెరుగుపరచడం కోసం ఈ సర్వేల ద్వారా వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించడం జరుగుతోంది. 

ఈ విధానాల ద్వారా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేసి ఆన్ లైన్ సేవలను మెరుగుపరిచేందుకు తోడ్పడాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.