PAVITROTSAVAM AT CHANDRAGIRI SRI KODANDARAMA SWAMY TEMPLE FROM OCTOBER 12 TO 14 _ అక్టోబరు 12 నుండి 14వ తేదీ వరకు చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు
Tirupati, 09 October 2025: The Pavitrotsavam festival will be held at Sri Kodandarama Swamy Temple, Chandragiri, from October 12 to 14.
The rituals will begin on October 11 at 6 PM with Ankurarpanam.
According to Vedic tradition, minor mistakes or impurities may occur in the temple due to devotees or staff. To purify the temple and maintain its sanctity, Pavitrotsavam is performed every year. The festival includes temple purification rituals and Punyahavachanam.
October 12- From 7 AM to 9 AM, Chatushtana Archana and Pavitra Pratishtha, followed by evening Vedic rituals.
October 13- From 7 AM to 9 AM, Vedic rituals in the Yagashala; from 9 AM to 10 AM, Pavitra Samarpana, followed by Pavitra Homam in the evening.
October 14- From 10.30 AM, Maha Poornahuti, Kumbha Prokshanam, Pavitra Visarjana, Snapana Tirumanjanam, and Chakra Snanam.
In the evening at 6 PM, Veedhi Utsavam will be held.
Devotee couples can participate in the Pavitrotsavam Arjitha Seva by paying Rs.200.
They will receive Pavitra and Tirtha Prasadam as blessings.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
అక్టోబరు 12 నుండి 14వ తేదీ వరకు చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి, 2025 అక్టోబరు 09: చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 12 నుండి 14వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అక్టోబరు 11న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అక్టోబరు 12వ తేదీ ఉదయం 7 నుండి 9 గంటల వరకు చతుష్టానార్చన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
అక్టోబరు 13న ఉదయం 7 నుండి 9 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 9 నుండి 10 గంటల వరకు పవిత్రసమర్పణ, సాయంత్రం పవిత్ర హోమాలు నిర్వహిస్తారు.
అక్టోబరు 14న ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహూతి, కుంభప్రోక్షణ, పవిత్ర విసర్జన, స్నపన తిరుమంజనం, చక్రస్నానం సాయంత్రం 6 గంటలకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, స్వామివారి తీర్థప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
