VEDANTA DESIKAR UTSAVAM _ అక్టోబరు 14 నుండి 23వ తేదీ వరకు శ్రీ వేదాంత దేశికర్ సాలకట్ల ఉత్సవం
TIRUPATI, 12 OCTOBER 2023: Sri Vedanta Desikar Salaktla Utsavam will be observed in the sub-shrine of Sri Vedanta Desikar located in Sri Govindaraja Swamy temple at Tirupati from October 15-23.
On October 23, the last day of the festival, Sri Govindarajaswamy along with Sridevi and Bhudevi will visit the Sri Vedanta Desikar temple. Sattumora and Asthanam will be held there. On this occasion, Appa Padi is brought in a procession from Tirumala Srivari Temple and offered to Sri Vedanta Desikar. Unjal Seva at Sri Govindaraja Swamy temple is cancelled by TTD due to this festival.
Sri Vedanta Desikar was born in Kanchipuram about 750 years ago and is the Guru of Sri Prativadi Bhayankara Annan who has penned Suprabhatam of Sri Venakteswara Swamy.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అక్టోబరు 14 నుండి 23వ తేదీ వరకు శ్రీ వేదాంత దేశికర్ సాలకట్ల ఉత్సవం
తిరుపతి, 2023 అక్టోబరు 12: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వేదాంత దేశికర్ ఆలయంలో అక్టోబరు 14 నుండి 23వ తేదీ వరకు సాలకట్ల ఉత్సవం జరుగనుంది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఘంటా స్వరూపులు శ్రీ వేదాంతదేశికర్. వీరి జయంతిని పురస్కరించుకుని ఈ ఉత్సవం నిర్వహిస్తారు.
ఉత్సవాల చివరి రోజైన అక్టోబరు 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీవేదాంత దేశికర్ ఆలయానికి వేంచేపు చేస్తారు. అక్కడ శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అప్పా పడిని ఊరేగింపుగా తెచ్చి శ్రీ వేదాంత దేశికర్ వారికి సమర్పిస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది.
శ్రీవేంకటేశ్వరస్వామివారు జన్మించిన భాద్రపద మాసం శ్రవణ నక్షత్రంలోనే శ్రీవేదాంత దేశికర్ సుమారు 750 సంవత్సరాల క్రితం కాంచీపురంలోని తూప్పుల్ అగ్రహారంలో పుట్టారు. ఈయన స్వామివారిని కీర్తిస్తూ దయా శతకం అనే స్తోత్రం రచించారు. శ్రీవారి సుప్రభాతం రచించిన శ్రీ ప్రతివాద భయంకర అణ్ణన్‌కు శ్రీ వేదాంత దేశికర్ గురువర్యులు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.