KOIL ALWAR TIRUMANJANAM IN SRI GT _ అక్టోబరు 16న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 13 October 2025: The Koil Alwar Tirumanjanam will be observed in Sri Govindaraja Swamy temple in Tirupati on October 16 in connection with Deepavali Asthanam on October 20.
The religious ritual will take place from 6:30am to 9:30am on Thursday. Later on devotees will be allowed for darshan.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
అక్టోబరు 16న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2025 అక్టోబరు 13: తిరుపతి శ్రీ స్వామివారి ఆలయంలో అక్టోబరు 20న దీపావళి ఆస్థానం సందర్భంగా
అక్టోబర్ 16వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా అక్టోబర్ 16న ఉదయం 5 గం.లకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన, నివేదన, శాత్తుమొర జరుగనుంది, తదుపరి 6.30 గం.ల. నుండీ 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా గోడలకు (లేపనం) పూస్తారు. అనంతరం భక్తులను ఉదయం 09.30 గంటల తర్వాత సర్వ దర్శనానికి అనుమతిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
